You are here
Home > Latest News > రైతుబంధు ఓట్ల కోసం కాదు.

రైతుబంధు ఓట్ల కోసం కాదు.

Spread the love

 

  • రైతు కష్టం తీర్చాలని, అప్పుల భారం తీర్చాలనే రైతుబంధు తెచ్చింది.
  • ఓట్ల కోసం అయితే.. ఏడాది ముందే ఎందుకు తెస్తుంది?.
  • అన్నదాతను ఆదుకునే ప్రయత్నంపై విషపు రాతలాపండి విశాలాంధ్ర.

దేశానికి అన్నంపెట్టే రైతును ఆదుకునేందుకు ఏ ప్రభుత్వం ప్రయత్నించలేదు. కనీసం… ఎంతోకొంత సాయం చేయాలన్న సోయి గత పాలకులకు లేదు. ఆరుదశాబ్దాలు పాలించి రైతుకు కనీసం ఎరువులు, విత్తనాలు అందించలేకపోయారు. అన్నదాత ఆత్మహత్యలను గత పాలకులే పెంచారు. కరెంటు ఇవ్వలేదు, నీళ్లు ఇవ్వలేదు, ఆఖరికి పండిన పంటను కొనుగోలు చేసే దిక్కు కూడా లేక అన్నదాతలు నానా అవస్థలు పడ్డారు.

కానీ.. రైతు కష్టానికి చరమగీతం పాడుతూ.. ప్రపంచంలో ఏ నాయకుడు చేయని విధంగా రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తన్నారు. ఇప్పటికే.. రుణమాఫీతో రైతుకు ఆర్థిక కష్టాలు తీర్చారు. 24గంటల కరెంటు, గోదావరి, కృష్ణమ్మతో పుష్కలంగా సాగునీరు అందిస్తూ రైతన్న ఇంట సిరుల పంటలు పండిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక సాగుకు ముందు రైతు అప్పుకోసం వెళ్లకుండా.. దేశంలోనే కాదు ప్రపంచలోనే ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. ఎకరాకు రెండు పంటలకు కలిపి.. 8వేల సాయం అందిస్తూ పేద రైతుల పాలిట దైవంలా మారారు సీఎం కేసీఆర్. అంతేకాదు.. ఏళ్ల తరబడి చిక్కుల తడకగా ఉన్న భూ రికార్డులను కూడా ప్రక్షాళన చేసి శభాష్ అనిపించుకున్నారు.

కానీ.. ఇవన్నీ ఓట్ల కోసమే అనడం శుద్ధతప్పు. రైతు కష్టం తెలిసిన వాడైతే.. రైతుబంధు ఓట్లు కురిపించేనా అనే రాతలు రాయడు. రైతును ఆదుకోని ఏ ప్రభుత్వంపైనా రాయడం చేతకాని జర్నలిస్టులు.. నిస్వార్థంగా, ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా రైతుకు సాయం చేస్తుంటే ఓట్ల కోసం అంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. రైతుబంధు నిజం ఓట్ల కోసమే తీసుకొచ్చి ఉంటే.. ఏడాది ముందు పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఏంటి?. ఓట్లకోసమైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే వారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక అమలు చేసేవారు. కానీ.. ఏడాది ముందే ఏ ఒక్కరూ అడుగకున్నా.. రైతుబంధు అమలు చేస్తున్నారంటే.. అన్నదాత బాధలు తీర్చాలని సీఎం ఏ విధంగా కష్టపడుతున్నారో అర్థం అవుతోంది. ఇప్పటికైనా మీ పిచ్చి రాతలు మానుకుని రైతుబంధుతో రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో.. ప్రపంచానికి తెలియజెప్పండి.

Top