You are here
Home > Latest News > లక్ష్మణా.. ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్నవు.. నీ బుద్ధి మందగించిందా?

లక్ష్మణా.. ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్నవు.. నీ బుద్ధి మందగించిందా?

Spread the love

 

  • రాష్ట్రంలో శాంతిభద్రతల రక్షణ కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకూడదా?
  • కత్తి మహేశ్ పై ఆరు నెలలు నగర బహిష్కరణ విధించిన విషయం మరిచిపోయావా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఏం మాట్లాడుతున్నడో ఆయనకే అర్థం కావట్లేదు. ఆయనకు ఏదీ ఆగనట్టుంది. తెలంగాణ కోసం ఆయన చేసేది ఏం ఉండదు కాని.. పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ.. ఆయనేదో గొప్ప పని చేసినట్టు జబ్బలు చరుచుకుంటాడు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేండ్లలో శాంతి భద్రతల విషయంలో దేశంలో మనమే టాప్ లో ఉన్నాం. మరి.. నువ్వేమో ఏదేదో మాట్లాడుతాంటివి.

నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయి. ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ నిబద్ధతతో పని చేస్తున్నది. హైదరాబాద్ నగరం గత మూడు సంవత్సరాలుగా ఉత్తమ జీవన ప్రమాణాల నగరంగా తొలి స్థానం సంపాదించింది. అవన్నీ ఊరికే రాలేదు లక్ష్మణ్. ఇక్కడున్న శాంతి భద్రతలు, అభివృద్ధే తొలి స్థానానికి కారణం. మరి ఇవన్నీ మాట్లాడవెందుకు నువ్వు.

ఎవరో ఓ వ్యక్తి తన స్వార్థం కోసం చేసిన వ్యాఖ్యలను కూడా ప్రభుత్వంతో ముడిపెడుతున్నవంటే నువ్వు ఎట్లాంటోడివో అర్థం అయితనే ఉన్నది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ప్రభుత్వం అస్సలు వదలదు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్ ను హైదరాబాద్ నుంచి ఆరు నెలల పాటు బహిష్కరించింది. మధ్యలో రావాలని ప్రయత్నిస్తే 3 ఏండ్లు జైలు శిక్ష వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే కత్తి మహేశ్ ను తెలంగాణ నుంచే బహిష్కరించే ప్రతిపాదనలు ఉన్నాయి. మరి.. ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు చేస్తున్నది. రాష్ట్ర ప్రజల బాగోగుల కోసమే కదా. పరిపూర్ణానంద యాత్ర వల్ల నగరంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ట్రాఫిక్ కు సమస్య, నగర ప్రజలకు సమస్య, విద్యార్థులు, ఉద్యోగులకు సమస్యలు ఏర్పడవచ్చు. శాంతి భద్రతల సమస్య ఏర్పడవచ్చు. మరి.. వీటన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి కదా లక్ష్మణ్. మీరు ఎంతసేపు ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీదేయాలనే చూస్తున్నారు తప్పితే తెలంగాణ బాగోగులు పట్టించుకున్నట్టుగా మాత్రం ఏం అనిపించడం లేదు.

 

 

 

 

Top