You are here
Home > Latest News > లక్ష్మణ్… అతికి కూడా ఓ హద్దు ఉంటుంది!

లక్ష్మణ్… అతికి కూడా ఓ హద్దు ఉంటుంది!

Spread the love

 

  • – బీజేపీ రాష్ట్ర నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ షో
  • – అమిత్ షా వస్తున్నారంటే బ్రహ్మాండం వస్తున్నట్టు కామెంట్లు
  • – పువ్వు పార్టీ నేతల తీరుపై అసహనంతో ఓటర్లు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. రెచ్చిపోతున్నారు. స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఉన్న సీట్లను కూడా గెలుచుకునే స్థితిలో లేని ఆయన.. అధికారంలోకి వచ్చేది తామేనని భ్రమపడుతున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వస్తున్నారని.. అది తెలిసి టీఆర్ఎస్, కాంగ్రెస్ కు దడ పుడుతోందని అంటున్నారు. కానీ.. సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టే టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతోన్న విషయాన్ని లక్ష్మణ్ విస్మరించారు.

గెలుపుపై నమ్మకం లేకనే.. టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలతో అంటకాగుతున్న కాంగ్రెస్ ను మాత్రం లక్ష్మణ్ కాస్త గట్టిగానే వేసుకున్నారు. ఆ పార్టీ తీరును కూడా ఎండగట్టారు. కానీ.. టీఆర్ఎస్ పైనే ఆయన చేసిన కామెంట్లు అర్థరహితంగా ఉన్నాయి. ఎవరి స్థాయి ఏంటో తెలిసి మాట్లాడితే మంచిదన్న సలహాలు కూడా లక్ష్మణ్ బాబుకు అందుతున్నాయి. కానీ.. వాపును చూసుకుని బలుపుగా భావించేవాళ్లలా.. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీని చూసుకుని ఇక్కడ సరైన కేడర్ లేకున్నా… అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికేంతగా లక్ష్మణ్ దిగజారిపోయారు.

ఒకప్పుడు అధిష్టానం నుంచి కనీసం అపాయింట్ మెంట్ కూడా తెచ్చుకోలేకపోయిన లక్ష్మణ్.. ఇప్పుడు అమిత్ షా వస్తున్నారహో అంటూ ఏదేదో చెప్పి భ్రమల్లో బతికేస్తున్నారు. లక్ష్మణ్ లాంటి వారి వల్ల సాధ్యం కాదని గుర్తించే.. కనీసం మత ప్రాతిపదికన పది ఓట్లు తెచ్చుకుందామన్న ఆశతో పరిపూర్ణానంద వెంట బీజేపీ పడుతున్న విషయాన్ని కూడా ఆయన గుర్తించలేకపోతున్నారు. తన పార్టీ విషయాలనే ఇంతగా తెలుసుకోలేకపోతున్న లక్ష్మణ్.. ఇక తెలంగాణను ఏం ఉద్ధరిస్తాడు? అధికారంలోకి ఏం వస్తాడు? కేసీఆర్ ను వదులుకుని బీజేపీ లాంటి పార్టీల చేతికి ప్రజలు అధికారం ఎందుకు ఇస్తారు? ఇవ్వనే ఇవ్వరు.

Top