You are here
Home > Inter National News > లక్ష్మణ్.. జీవితంలో ఒక్కసారైనా నిజాలు మాట్లాడు!

లక్ష్మణ్.. జీవితంలో ఒక్కసారైనా నిజాలు మాట్లాడు!

Spread the love

 

రాష్ట్రంలో నిరంతర విద్యుత్ కు.. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ కూ తేడా లేకుండా మాట్లాడుతున్న లక్ష్మణ్ ను చూసి జాలిపడాలో.. ఆయన మూర్ఖత్వానికి అసహ్యించుకోవాలో అర్థం కావడం లేదు. నిజమే. ఉదయ్ పథకంలో కేంద్రం రాష్ట్రాన్ని చేర్చింది. 24 గంటల కరెంటు ఇచ్చేందుకూ చర్యలు తీసుకుంటోంది. కానీ.. వ్యవసాయానికి ఉచితంగా కేంద్రం ఏమైనా కరెంటు సరఫరా చేస్తోందా? కనీసం వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఏమైనా ఇచ్చే ప్లాన్ చేస్తోందా?

అసలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకే లక్ష్మణ్ కు తీరికలేదు. ఎంత సేపూ.. రాష్ట్రానికి ఏమీ చేయని.. కేంద్రాన్ని వెనకేసుకు వచ్చేందుకే ఆయనకు ఉన్న సమయం అయిపోతోంది. ఆ ప్రయత్నంలోనే.. ఇలా సమయం, సందర్భం లేకుండా లక్ష్మణ్ అబద్ధాలు ప్రచారం చేయాల్సి వస్తోంది. మిగతా రాష్ట్రాలకే ఇస్తున్నట్టే కేంద్రం రాష్ట్రానికి ఏదైనా ఇస్తుండవచ్చు గాక. అంతే కానీ.. దేశంలో అత్యధికంగా ఆదాయాన్ని సృష్టిస్తున్న తెలంగాణ నుంచి వేల కోట్ల పన్నులు గుంజుతున్న కేంద్రం.. తిరిగి అంతకు తగిన స్థాయిలో ఏమైనా చేస్తోందా అంటే.. లేదు అనే అంతా చెబుతున్నారు.

ఆ మాత్రం దానికి లక్ష్మణ్ ఇంతగా గొంతు చించుకోవాల్సిన అవసరం లేదు. లక్ష్మణ్ ఓ సారి రాజస్థానీ పత్రికల ఎడిటోరియల్ కాలమ్స్ చదివితే అయినా వాస్తవాలు అర్థమవుతాయి. అక్కడ ఉన్నది బీజేపీ సర్కారే. అయినా.. అక్కడి పత్రికలు.. మన రాష్ట్ర ఘనతను కీర్తించాయి. తెలంగాణను చూసి నేర్చుకోవాలని ఇతర పార్టీలకు చురకలు పెట్టాయి. ఇలా.. వేరే రాష్ట్రాలు కూడా.. మన రాష్ట్ర ప్రభుత్వ ఘనతను గుర్తిస్తుంటే… ఇలా బీజేపీ నేతలు మాత్రం అబద్ధాల పునాదులపైనే తమ కోటలు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Top