You are here
Home > Latest News > వచ్చేస్తున్నాయ్.. భగీరథ నీళ్లు

వచ్చేస్తున్నాయ్.. భగీరథ నీళ్లు

Spread the love

వచ్చేస్తున్నాయ్.. భగీరథ నీళ్లు

రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ కాళ్లను గోదారి, కృష్ణమ్మ నీటితో కడుగుతాం.. కుళాయితో ప్రతి ఇంటికీ మంచి నీళ్లను అందిస్తాం.. ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం అని చెప్పి.. ధైర్యంగా అడుగులు వేసిన ప్రభుత్వం.. మన కేసీఆర్ ప్రభుత్వం. మాట చెప్పడం, ఇవ్వడమే కాదు.. ఆ మాటను తీర్చకుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదంటూ.. మరే పార్టీకి సాధ్యం కాని రీతిలో.. సంచలనమైన సవాల్ చేసి మరీ జనంలోకి వెళ్తున్న సర్కార్.. ఇచ్చిన మాట తీర్చుకోబోతోంది.

ఇప్పటికే.. రాష్ట్ర వ్యాప్తంగా.. మిషన్ భగీరథ పనులను శరవేగంగా పూర్తి చేయిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ మధ్యే.. ఉన్నతాధికారులతో సమీక్ష కూడా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీని గుర్తు చేసిన కేసీఆర్.. వచ్చే డిసెంబర్ లోగా.. సాధ్యమైనంత మంది ప్రజలకు.. మిషన్ భగీరథ ఫలాలు అందించాల్సిందే అని తేల్చి చెప్పారు. పంప్ హౌజ్ ల నిర్మాణం.. పైప్ లైన్ల పనులు.. నీటి సరఫరా పనులు ఎక్కడి వరకూ వచ్చాయో అడిగి తెలుసుకున్నరు.

మిషన్ భగీరథ కార్యక్రమం.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కీలకమో వివరిస్తూ.. త్వరలోనే తాను కూడా.. పనులు పరిశీలించేందుకు క్షేత్ర స్థాయి పర్యటనకు వస్తానని.. పనుల తీరును ప్రజలకు వివరిస్తానని అధికారులకు చెప్పారు.. ముఖ్యమంత్రి. అంతే కాదు.. పనుల పూర్తి విషయంలో.. ప్రజా ప్రతినిధులతో పాటు.. పార్టీ కార్యకర్తలను కూడా పురమాయిస్తున్నరు. అనుకున్న సమయానికే పనులు పూర్తయ్యేలా శ్రమిస్తున్నరు.

ఈ దిశగా.. 42 వేల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని నిధులుగా కేటాయించిన సర్కార్.. లక్షా 30 వేల కిలోమీటర్ల మేర వాటర్ పైప్ లైన్లు వేయిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల గ్రామాలు.. 65 పట్టణాలకు తాగునీటిని అందించే లక్ష్యానికి చేరువ అవుతోంది. ఇప్పటికే ఇంటింటికీ నల్లా కనెక్షన్ పొందిన మొట్టమొదటి నియోజకవర్గంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సెగ్మెంట్ గజ్వేల్.. దేశంలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఇప్పుడు.. పనులన్నీ పూర్తై.. త్వరలోనే మిషన్ భగీరథ ఫలాలు ప్రజలకు అందితే సురక్షిత మంచినీరు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటివరకూ.. గత ప్రభుత్వాలు మాటలు చెప్పడమే తప్ప.. హామీలు తీర్చిన సందర్భాలు చాలా అరుదు. ముఖ్యంగా.. జనానికి నిత్యఅవసరమైన మంచి నీళ్ల విషయంలో.. గత పాలకులు ఏం చెప్పారో.. ఏం పనులు చేశారో ఎవరికీ తెలియదు. తుప్పుబట్టిన పైప్ లైన్లు.. నాణ్యత లేని పనులతో.. నిధులను వృథా చేసి అవినీతిమయంగా మారిన గత ప్రభుత్వాల తీరుతో ప్రజలు కూడా.. విసిగి వేసారి ఉన్నరు.

కానీ.. ఆ పరిస్థిని.. ఆ కష్టాన్ని ఇప్పుడు.. ప్రభుత్వం పూర్తిగా మార్చేయబోతోంది. ఇంటింటికీ.. సురక్షిత మంచినీళ్లతో.. జనం గొంతు తడపడంతో పాటు.. వాళ్లకు ఆరోగ్యాన్ని కూడా ప్రదానం చేయనుంది. ఇంత ముఖ్యమైన కార్యక్రమం కాబట్టే.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు పూర్తి చేయిస్తోంది. ఈ చర్యలను అనుక్షణం గమనిస్తున్న ప్రజలు కూడా.. మిషన్ భగీరథ ఫలాలను అందుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నరు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వాన్ని మరోసారి సురక్షిత మంచినీటి సాక్షిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నరు.

Top