You are here
Home > Latest News > వాపును చూసుకొని బలుపు అనునుకోని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్. 

వాపును చూసుకొని బలుపు అనునుకోని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్. 

Spread the love
  • వాపును చూసుకొని బలుపు అనునుకోని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్.
  • లేని సమస్యల ప్రస్తావన తీసుకొచ్చి కోరి ఇక్కట్లు తెచ్చుకుంటున్న కాంగ్రెస్.
  • సొంత మీడియా తో డప్పు కొట్టించుకుంటే అది విజయం అవుతుందా మల్లు బట్టి విక్రమార్క.
  • భట్టి ఊపు ప్రజాసంక్షేమం కోసం కాదు పార్టీ పగ్గాల కోసం.
కాంగ్రెస్ పార్టీ వాపును చూసుకొని బలుపు అనుకుంటుంది.60 ఏళ్ల అధికారంలో చేసిన పాపాలకి ఇప్పుడు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏదో సాధించాలని అసెంబ్లీలో ఊదరగొట్టి, సొంత మీడియాలో డప్పులు కుట్టించుకుంటూ ప్రచారాలు చేయించుకుంటుంది.కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మిగిలింది కేవలం ఐదుగురు నేతలే వాళ్ళలో వాళ్ళకే పడటంలేదు. పీసీసీ మార్పు జరుగుతుంది అన్న వార్తల నేపథ్యంలో పిసిసి అధికార కోసం ఉన్న నేతలు ఒకరినొకరు కొట్టుకుంటూ ప్రజా సమస్యలపై ఏనాడు లేని విధంగా లేని సమస్యలను ప్రస్తావిస్తూ తమలో తామే కొట్టుకుంటూ ఇక్కట్లు తెచ్చుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలో బతికి బట్టకట్టె పరిస్థితులు లేవు కాబట్టే ఆ పార్టీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ రాజీనామా చేసి పక్కకు జరగడం జరిగింది.ఏ మొగుడు లేకుంటే అక్క మొగుడే దిక్కు అన్న పరిస్థితి గా మారిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దీన స్థితిలో ఉందో అందరికీ అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి అదే పరిస్థితి ఉంది.గత రెండు అసెంబ్లీ ఎలక్షన్లలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఉన్న నేతలు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు చేసిన అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
ఎన్నడూలేని ప్రజా సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఎవరైనా, అది నిజంగా ప్రజలు అంటే ప్రేమ గురించి కాదని పీసీసీ అధికారాలు దక్కించుకోవాలని నేపథ్యంలోనే ఇటువంటి పిచ్చి వాగుడు వాగుతూ సొంత మీడియాలో డప్పు కొట్టించుకుంటున్నారని తెలంగాణలోని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.పిసిసి అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అంధకారంలోకి పడుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Top