You are here
Home > Latest News > వాస్తవాలు రాయండి లేకపోతే చరిత్ర హీనులుగా మారి పోతారు ..జాగ్రత్త

వాస్తవాలు రాయండి లేకపోతే చరిత్ర హీనులుగా మారి పోతారు ..జాగ్రత్త

Spread the love

గుర్తించలేదు’ అనడం.. శుద్ధ తప్పు!

అవగాహన లేక రాస్తున్నారో.. వాస్తవాలు తెలియక రాస్తున్నారో కానీ.. సెప్టెంబర్ 17 విషయంలో కొందరు అలవాటులో పొరపాటుగా.. తప్పుడు రాతలు రాస్తూనే ఉన్నారు. జనం ఎంత ఛీ కొట్టినా.. ప్రభుత్వం ఎంతగా వివరణ ఇస్తూనే ఉన్నా.. పార్టీ పరంగా టీఆర్ఎస్ నాయకులు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నా.. అవేవీ పట్టించుకోకుండా.. ఛీ కొట్టించుకుంటున్నారు. అధికారికంగా నిర్వహించకుంటే కేసీఆర్ కు ఇబ్బందే అని కారుకూతలు కూస్తున్నారు.

మన నిధులు.. మన నీళ్లు.. మన నియామకాలు. ఈ ట్యాగ్ లైన్ తో ఉద్యమం చేసి.. చివరికి అధికారంలోకి వచ్చిన కేసీఆర్… తర్వాత ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకునేందుకు అద్భుత రీతిలో సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు. అలాగే.. చారిత్రక సందర్భం అయిన.. సెప్టెంబర్ 17ను పార్టీ పరంగా నిర్వహిస్తూనే ఉన్నారు. అంటే.. ఆ రోజు విషయంలో కేసీఆర్ ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు.. అన్న విషయం తెలుస్తూనే ఉంది.

అలాగే.. ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రయత్నాలు జరుగుతున్నా కూడా.. కొందరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి.. శాంతియుతంగా వ్యవహరిస్తోంది. అంతెందుకు? గతంలో ఎన్నడూ సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించని కాంగ్రెస్ కూడా.. ఈ విషయంలో అప్పుడప్పుడూ మాట్లాడుతోంది తప్ప.. పెద్దగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.

కానీ.. స్వార్థ పూరిత రాజకీయాలు చేస్తున్న బీజేపీ మాత్రం.. ఈ విషయాన్ని గల్లీ గల్లీకి తీసుకెళ్లి పరువు పోగొట్టుకుంటోంది. ఇన్నాళ్లూ ఏ ప్రజా సమస్యపై వీధుల్లోకి వచ్చారని.. ఇప్పుడు ఈ విషయాన్ని వివాదాస్పదం చేస్తున్నారు అంటూ.. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో పోతున్న పరువును నిలబెట్టుకోలేక.. జనాదరణను పెంచుకోలేక బీజేపీ నేతలు సతమతమవ్వాల్సి వస్తోంది.

దీంతో.. అన్ని వర్గాల ప్రజల మేలు కోసం.. కేసీఆర్ చేస్తున్నదే కరెక్ట్.. అని మరోసారి రుజువు అయ్యింది. తగిన సమయం వచ్చినపుడు.. అందరి సమ్మతితో.. అందరి ఆమోదంతో.. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేందుకు అవసరమైన కసరత్తు కూడా జరుగుతోంది. అలాంటి కేసీఆర్ కు.. సెప్టెంబర్ 17 అనేది.. రాజకీయంగా సమస్యలు తెచ్చిపెడుతుందని.. అధికారికంగా నిర్వహించకుంటే సమస్యలు తప్పవని వార్తలు రాస్తున్నవారికి.. రాజకీయ అవగాహన ఉందా.. లేదా అన్న అనుమానం కలుగుతోంది.

Top