You are here
Home > Latest News > విపక్షాల నోళ్లకు తాళాలు!!

విపక్షాల నోళ్లకు తాళాలు!!

Spread the love

 

  • ముందస్తుపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలు
  • ప్రగతి వివరాల సమర్పణకే పరిమితమైన సభ
  • సభకు వచ్చిన ఆదరణతో మూతపడిన విపక్షాల నోళ్లు

పేదల పెన్నిధిగా నిలిచిన ప్రభుత్వానికి అసలు సిసలైన ప్రజాదరణ అంటే ఎలా ఉంటుందో.. కొంగర కలాన్ ప్రగతి నివేదన సభ నిరూపించింది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల నుంచి అందుబాటులో ఉన్న మార్గాల్లో లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు… కేసీఆర్ పరిపాలనకు నీరాజనం పలికారు. ముందస్తు ఎన్నికల కోసమే టీఆర్ఎస్ ఈ సభ నిర్వహిస్తోందని విపక్షాలు చేసిన తప్పుడు ప్రచారాలకు ప్రజలు చెప్పు దెబ్బ లాంటి సమాధానం ఇచ్చారు.

చేసిన ప్రగతి, జరిగిన సంక్షేమం గురించి ముఖ్యమంత్రి వివరిస్తుంటే ఇది ముందస్తు ఎన్నికల సన్నాహకం కాదు… జనాన్ని నేరుగా కలిసేందుకు, వారికి అందుతున్న సంక్షేమాన్ని స్వయంగా వివరించేందుకు, జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకే అన్న విషయం అందరికీ సులువుగా అర్థమైపోయింది. అందుకే.. ఈ సారి ఎక్కువగా విమర్శలకు పోకుండా… తమ ప్రభుత్వ పరిధిలోని విషయాలను మాత్రమే ముఖ్యమంత్రి వివరించిన వైనానికి రాష్ట్రం సలామ్ కొట్టింది.

తమను తిట్టకుండానే… జనాన్ని ఇంతగా కేసీఆర్ పోగేయగలిగారా? అని విపక్షం కూడా అనధికారికంగా నోళ్లు వెళ్లబెడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేనా… మన పార్టీలు అయితే ఇంత భారీగా సభలు నిర్వహించేవా అని కాంగ్రెస్ శ్రేణులు మాత్రమే కాదు… టీడీపీ, బీజేపీ నేతలు, ఆఖరికి వామపక్ష పార్టీలు కూడా నిరుత్సాహానికి గురవుతున్నాయంటే… టీఆర్ఎస్ ప్రభంజనం.. ముఖ్యమంత్రికి ఉన్న ప్రజాదరణ ఎంతటి అనూహ్య స్థాయిని అందుకుందన్నది కూడా తెలిసిపోతోంది.

దీంతో.. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ వైపే రాష్ట్ర ప్రజానీకం నడవబోతోందని… ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెబుతున్నట్టుగా 100 మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ స్థానాలను టీఆర్ఎస్ ఎన్నికల్లో కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రగతి నివేదన సభకు హాజరైన జనాన్ని, వారి ఉత్సాహాన్ని గమనించినా చాలు.. మళ్లీ రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని కూడా తేల్చి చెబుతున్నారు.

Top