You are here
Home > Latest News > వివేక్‌.. న‌మ్మ‌క‌ద్రోహానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌వు నువ్వు..

వివేక్‌.. న‌మ్మ‌క‌ద్రోహానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌వు నువ్వు..

Spread the love
  1. వివేక్‌.. న‌మ్మ‌క‌ద్రోహానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌వు నువ్వు..
  2. కేసీఆర్ కాలిగోటికి కూడా స‌రిపోని ద్రోహివి నువ్వు
  3. కేసీఆర్ అన్ని విష‌యాల్లో న‌మ్మ‌క‌ద్రోహం చేశాడ‌ట‌.
  4. ఏ ప‌థ‌కాన్నీ స‌రిగ్గా అమ‌లు చేయ‌లేద‌ట‌. ఆడిన మాట త‌ప్పాడ‌ట‌.
  5. ఇటీవ‌ల బీజేపీలో చేరిన గ‌డ్డం వివేక్ చేసిన విమ‌ర్శ‌లివి. వివేక్‌గారూ..
  6. న‌మ్మ‌క‌ద్రోహం విష‌యంలో మీకు పేటెంట్లు ఉన్నాయి.
  7. న‌మ్మి తెరాస‌లో ప‌ద‌వులు ఇస్తే పార్టీకి ద్రోహం చేసింది నువ్వు.
  8. నీ అన్న‌ను బీఎస్పీ నుంచి పోటీ చేయించింది నువ్వు.
  9. రామగుండం, చెన్నూరు, పెద్ద‌ప‌ల్లి ఎమ్మెల్యేలు గెల‌వ‌కుండా కుట్ర‌లు చేసింది నువ్వు.
  10. తండ్రి ఆశ‌యాల‌కు తూట్లుపొడిచి బీజేపీలో చేరింది నువ్వు.

అందుకే నిన్ను కేసీఆర్ పార్టీ నుంచి తీసేశాడు. అలాంటి నీకు కేసీఆర్‌ను విమ‌ర్శించే స్థాయి లేదు.  అభివృద్ధిలో తెలంగాణ‌ను నెం.1గా మార్చిన మ‌నిషి కేసీఆర్‌.  అభివృద్ధి విష‌యంలో తెలంగాణ నం.1. ఈ విష‌యంలో జాతీయ సగటును తెలంగాణ దాటిపోయింది. తెలంగాణ 10.4% వృద్ధిరేటును సాధించింది. వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.

2018–19 వార్షిక బడ్జెట్‌లో సామాజిక సేవా పథకాలకు 43% నిధులు కేటాయించారు. ఎస్సీ ప్రత్యేకాభివృద్ధి నిధికి రూ.16,400 కోట్లు, గిరిజన ప్రత్యేకాభివృద్ధి నిధికి రూ.9,600 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2వేల కోట్లు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమానికి రూ.1800 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్, గొర్రెల పంపిణీ, చేపల విత్తనాల పంపిణీతో పాటు నాయీ బ్రాహ్మణ వర్గానికి ప్రత్యేక పథకాలను యుద్ధప్రాతిపదికన అమలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రైతు బంధు’పథకం విప్లవాత్మకం. ఈ పథకం కింద రైతుకు ఒక్కో ఎకరానికి రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తున్నారు.  రెండు సార్లు అమలు చేసే ఈ పథకంకింద ఇప్పటివరకు 58 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనాన్ని అందిస్తున్నారు. ఈ ప‌థ‌కాల్లో మీ బీజేపీ ప్ర‌భుత్వం ఒక్క‌టైనా అమ‌లు చేస్తున్న‌దా వివేక్‌ ?

Top