You are here
Home > Latest News > విష ప్ర‌చారాలు మానుకోని ఆంధ్ర‌జ్యోతి

విష ప్ర‌చారాలు మానుకోని ఆంధ్ర‌జ్యోతి

Spread the love
  • తెలంగాణ సిగ‌లో సింగ‌రేణి
  • అప్పుల నుండి ఇప్పుడు వేల కోట్ల లాభాల్లోకి
  • న‌ష్టాల్లో ఉన్నా.. ఆర్టీసీని కూడా ప్రైవేట్ ప‌రం చేయ‌ని తెలంగాణ స‌ర్కారు
  • అలాంటి సింగ‌రేణిని ఎలా ప్రైవేటీక‌ర‌ణ చేస్తారు ?
  • తొలి నుండీ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తున్న ప్ర‌భుత్వం
  • ప్ర‌భుత్వం, కార్మికుల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నాలు
  • విష ప్ర‌చారాలు మానుకోని ఆంధ్ర‌జ్యోతి
తెలంగాణ‌పై గొంతు వ‌ర‌కు విషం నింపుకున్న ఆంధ్ర‌జ్యోతి.. ప్ర‌తిరోజు దాన్ని క‌క్కుతూనే ఉంది. రాష్ట్రంలోని ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోరే ప్ర‌భుత్వం ఉన్నా… వారికి ప్ర‌భుత్వానికి మ‌ధ్య క‌ల‌త‌లు సృష్టించే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వివ‌క్ష‌కు గురైన సింగ‌రేణిని బంగారంగా మార్చింది కేసీఆర్ ప్ర‌భుత్వం. ఫ‌లితంగా ఇప్పుడు న‌ల్ల‌బంగారం సిరులు కురిపిస్తోంది. ఉత్ప‌త్తిలోనే కాదు… సంక్షేమంలోనూ ముందుకు దూసుకెళ్తోంది. ఉద్యోగుల క్షేమం కోరుతూ ముందుకు సాగుతున్న సింగరేణి దేశంలోనే అగ్రస్థానానికి చేరింది. సింగరేణి కార్మికుల క‌ష్టానికి ఫలితంగా థర్మల్ పవర్ స్టేషన్ నుంచి 22 వేల 500 మిల్లీ యూనిట్ల కరెంట్  రాష్ట్రానికి స‌ర‌ఫ‌రా అవుతోంది. అంతేకాదు.. 50 వేల కోట్ల రూపాయల అమ్మకాలు సాగించే దిశగా సింగరేణిని ముందుకు సాగుతున్న‌ది.
తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ఐదేండ్ల కాలంలో 281.9 శాతం లాభాలు.. 116.5 శాతం అమ్మకాల్లో వృద్ధిరేటు సాధించి రికార్డుకెక్కింది. గ‌తంలో 400 కోట్లు దాట‌ని సింగ‌రేణి లాభాలు..కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్రోత్సాహం వ‌ల్ల ఏకంగా 1600 కోట్ల రూపాయ‌ల లాభాల‌ను సాధిస్తోంది. ఐదేండ్ల‌లో సింగ‌రేణి త‌న అమ్మ‌కాల‌ను రెండింత‌లు చేసుకొని ఏకంగా రూ.25 వేల కోట్ల మార్కును దాటేసింది. ఇలాంటి సింగ‌రేణిని ప్రైవేటు ప‌రం చేయాల్సిన అవ‌స‌రం ఏముంది ? ఎక్క‌డైనా లాభాల్లో లేని సంస్థ‌ల‌ను మాత్ర‌మే ప్రైవేటీక‌ర‌ణ చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది. కానీ.. తెలంగాణ‌లో ఆర్టీసీ వంద‌ల కోట్ల న‌ష్టాల్లో ఉంది.
అయినా కార్మికుల సంక్షేమం కోసం సంస్థ‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌బోమ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. అన్న‌మాట ప్ర‌కార‌మే ప్ర‌భుత్వం నుండి సాయం కూడా చేస్తున్నారు. అలాంటి ఆర్టీసీనే ప్రైవేటీక‌ర‌ణ చేయ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం వేల కోట్ల లాభాల్లో ఉన్న సింగ‌రేణిని ఎలా ప్రైవేటీక‌ర‌ణ చేస్తుంది. కేవ‌లం ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు, కార్మికుల్లో ఉన్న విశ్వాసాన్ని చెద‌ర‌గొట్టాల‌నే ఉద్దేశంతో ఆంధ్ర‌జ్యోతి చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాన్ని తెలంగాణ వాదులు తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు.
Top