You are here
Home > Latest News > వీరేశంను కాదు వీహెచ్ ను తన్ని తరమాలి?.

వీరేశంను కాదు వీహెచ్ ను తన్ని తరమాలి?.

Spread the love
  • కేవలం రాజకీయ లబ్ధి కోసమే.. శ్రీనివాస్ హత్యపై రచ్చ.
  • నక్కకు నాగలోకానికి ముడిపెట్టడంలో కాంగ్రెస్ ది అందెవేసిన చేయి.
  • విష కీటకం నయీంను పెంచి పోషించిందే కాంగ్రెస్, టీడీపీ.

 

నక్కకు నాగలోకానికి ముడిపెట్టడంలో కాంగ్రెస్ ముందుంటుంది. లేకపోతే.. ఎక్కడో ఉండే వేముల వీరేశంకు.. మరెక్కడో ఉండే శ్రీనివాస్ కు ముడిపెడుతూ ఈ హత్యకు పాల్పడింది వీరేశమే అన్నట్లు ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. నకిరేకల్ కి.. నల్లగొండకు మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉంది. పోనీ మీరన్నట్లు వీరేశం ఇది చేయించాడుకోవడానికి హత్యకు గురైన శ్రీనివాస్ ది.. వీరేశం నియోజకవర్గం కాదు. అసలు వేముల వీరేశానికి శ్రీనివాస్ కు ఎక్కడా లొల్లి జరిగిన సందర్భం కూడా లేదు. ఆదిపత్యం ప్రదర్శించడానికి హత్య చేయించాడని ఊహించడానికి కూడా ఎక్కడా స్కోప్ లేదు. అటువంటిది ఏమాత్రం సంబంధం లేని వేముల వీరేశంను శ్రీనివాస్ హత్య కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అసలు నల్లగొండలో హత్యా రాజకీయాలు నడిపిందే కాంగ్రెస్. నయీం లాంటి గ్యాంగ్ స్టర్ ను పెంచి పోషించిందే కాంగ్రెస్, టీడీపీ నాయకులు? ఎంతోమందిని ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేసినా.. తమ రాజకీయాలకు గన్నేరు మొక్కలాంటి నయీంను వాడుకున్నారే తప్ప ఎక్కడా.. నయీం ఆగడాలకు అడ్డుచెప్పే ప్రయత్నం చేయలేదు. ఒక మాజీ హోంమంత్రిని చంపిన ఘటనలో ప్రధాన పాత్రదారి అయిన నయీంను స్వేచ్ఛగా రోడ్లపై తిరిగేలా చేసింది కాంగ్రెస్ కాదా??. మహిళ అని కూడా చూడకుండా బెల్లి లలితను అత్యంత క్రూరంగా.. తునా తునకలు చేసి.. దిక్కుకో ముక్క పడేస్తే కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఏం చేశాయి. అంతటి దుర్మార్గుడిపై ఏం చర్యలు తీసుకున్నాయి. కాంగ్రెస్ లా టీఆర్ఎస్ కూడా హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే నయీంను అంతమొందించేదా?. ఇదొక్క ప్రశ్నకు సమాధానం చెబితే కాంగ్రెస్ నాయకులంతా సత్య హరీశ్చంద్రులే??.

కేవలం రాజకీయ లబ్ధి కోసమే.. శ్రీనివాస్ హత్యపై రచ్చ చేస్తున్నారు. గట్టిగా పది అడుగులు నడవలేని వీహెచ్ లాంటి నాయకులు కూడా దీనిపై మాట్లాడుతున్నారు. అసలు వాస్తవం ఏంటి?. ఎవరీ హత్యకు పాల్పడ్డారనేది తెలియకుండానే నోటికొచ్చిన స్టేట్ మెంట్లు ఇస్తూ, పబ్బం గడుపుకుంటున్నారే తప్ప, కాంగ్రెస్ చేసే ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు.

Top