You are here
Home > Latest News > వీ6 తెలంగాణ మీడియానా లేక ఆంధ్రాదా?

వీ6 తెలంగాణ మీడియానా లేక ఆంధ్రాదా?

Spread the love
  • వీ6 తెలంగాణ మీడియానా లేక ఆంధ్రాదా?
  • తెలంగాణ వార్తలను గాలికి వదిలేసి పనికిమాలిన వార్తలకు ప్రాధాన్యత ఎందుకు…
  • కుక్కకు ఉన్న విశ్వాసం కూడా మీకు లేదా?

తెలంగాణ… రాష్ట్ర సాధనలో ఎన్నో అడ్డంకులు. తెలంగాణ పోరాటం అనేది ఈనాటిది కాదు.. 60 ఏళ్ల నుంచి సాగుతున్న పోరాటానికి సీఎం కేసీఆర్ వల్ల తెర పడింది. రాష్ట్రం సాకారం అయింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాదు.. కేసీఆర్ కు ఏం పనిలేదు.. అంటూ ఆయన్ను కించపరిచనవారూ ఉన్నారు. కానీ.. అవన్నీ లెక్క చేయకుండా పోరాటం చేశారు కేసీఆర్. ఇప్పుడు తెలంగాణ బిడ్డలు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఎటువంటి ఆందోళనలు లేవు. తెలంగాణ కూడా ప్రశాంతంగా ఉంది. కానీ.. తెలంగాణ రావడమే కాదు కదా.. అది అభివృద్ధి కూడా కావాలె. నో డౌట్.. దాని కోసం సీఎం కేసీఆర్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. కడుపు కట్టుకొని పనిచేస్తున్నారు. కానీ.. ఆయన ఒక్కరే కష్టపడటం కాదు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. అందరు కలిస్తేనే బంగారు తెలంగాణ సాకారం అవుతుంది.

అందుకోసం ప్రతి ఒక్కరు కంకణం కట్టాలి. మీడియా కూడా తమ పాత్ర పోషించాలి. ఆంధ్రా మీడియాను వదిలేద్దాం. పచ్చ మీడియా ఆ ఆంధ్రా బాబు, ఆంధ్రా ప్రయోజనాల కోసమే తెలంగాణలోనూ పనిచేస్తుంది. అది అందరికీ తెలిసిందే. మరి.. వీ6 కు ఏం పోయేకాలం వచ్చింది. అది తెలంగాణ మీడియానే కదా. తెలంగాణలో బతుకుతున్నది. తెలంగాణ పేరు చెప్పుకొని.. తెలంగాణ రిసోర్సులను ఉపయోగించుకుంటూ.. తెలంగాణ తనాన్ని ఒంట పట్టించుకున్నామని చెబుతున్న వీ6 ఎందుకు తెలంగాణ అభివృద్ధిపై పట్టించుకోవడం లేదో తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు.

ఒక న్యూస్ చానెల్, పేపరును పెట్టుకొని తెలంగాణ అభివృద్ధిని హైలెట్ చేయకుండా.. పనికిమాలిన కాంగ్రెస్ గురించి.. ఆ ఉత్తమ్ గురించి.. వందకు పైగా సీట్లలో డిపాజిట్లే దక్కని బీజేపీ గురించి వార్తలు ఇస్తున్నారు తప్పితే తెలంగాణ అభివృద్ధి గురించి మీకు పట్టదా? ఏం వివేక్. నువ్వు తెలంగాణోడివే కదా. తెలంగాణలోనే పుట్టావుగా. నీ వ్యాపారాలు ఉన్నది తెలంగాణలోనే కదా. అంటే.. నీకు కోట్లకు కోట్లు సంపాదించుకోవడానికి తెలంగాణ కావాలి.. కానీ.. తెలంగాణ అభివృద్ధి మాత్రం నీకు పట్టదు.. అంతేనా?

బెల్లంపల్లిలో వినోద్ పోటీ చేస్తే… వివపరీతంగా ప్రమోట్ చేసుకున్నావు. సరే.. మరి.. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిపై ఏది ఫోకస్. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ గురించి ఫోకస్ చేయడానికి మీకు మనసొప్పుతలేదా? తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతుల కోసం ఎన్నో పథకాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కడా తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు లేవు. వాటి గురించి రాయడానికి మీకు చేతగాదు. వాటి గురించి ప్రపంచానికి తెలియడానికి మీకు చేతగాదు కానీ.. ఉత్తమ్ గాంధీ భవన్ లో పనికిమాలిన మీటింగ్ పెడితే దాన్ని కవర్ చేస్తారు. ఇంకెవడో ఏదో మాట్లాడితే దాన్ని కవర్ చేస్తారు. ఏంది వీటి వల్ల ఉపయోగం. వాళ్ల వల్ల తెలంగాణకు ఏదైనా ఉపయోగం ఉందా? తెలంగాణలో ఎప్పుడో కనుమరుగైపోయిన బీజేపీ పార్టీకి సంబంధించిన కథనాలు.. ఇవన్నీ ఇచ్చినవాళ్లు తెలంగాణ అభివృద్ధిపై ఇవ్వడానికి ఎందుకు అంత బాధపడుతున్నారు. ఎందుకు గోడ మీద పిల్లుల్లా ప్రవర్తిస్తున్నారు. అయితే అటు.. లేకపోతే ఇటు.. అన్నట్టుగా వ్యవహరించి ఏం సాధిస్తారు. తెలంగాణ పేరు చెప్పుకొని కోట్లకు కోట్లు కూడేసుకున్నారు కదా. చాలదా. తెలంగాణలో ఉన్న వ్యాపారాలు సరిపోవా? తెలంగాణ పుణ్యమాని బతుకుతున్నారు.. కానీ.. తెలంగాణ అభివృద్ధి మాత్రం మీకు పట్టదు. షేమ్ ఆన్ యూ… సిగ్గు పడండి. తెలంగాణ ఉప్పు తింటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్న మీలాంటి వాళ్లు సిగ్గుతో తల దించుకోవాలి. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ మిమ్మల్ని ఆదరిస్తుంటే మీ కళ్లు నెత్తికెక్కాయి. అందుకే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని వదిలేసి తెలంగాణ ద్రోహులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆదరించినంతవరకే మీ మీడియా బతికేది. వాళ్లు ఒక్కసారి కన్నెర్ర చేశారో మీ మీడియా మూసీలో కొట్టుకుపోతుంది జాగ్రత్త.

Top