You are here
Home > Latest News > వ్యతిరేకత నిరూపించకుంటే.. రాజకీయాలు వదిలేస్తారా?

వ్యతిరేకత నిరూపించకుంటే.. రాజకీయాలు వదిలేస్తారా?

Spread the love

సీపీఎం బలం ఎంత? ఆ పార్టీకి ఉన్న బలగం ఎంత? ఒకప్పుడంటే రాజకీయ కమ్యూనిస్టులను జనం నమ్మారు. కానీ.. వారి స్వార్థపూరిత విధానాలు గమనించి.. కొన్నాళ్లుగా ఆ శక్తులకు చరమగీతం పాడుతున్నారు. అలాంటి సీపీఐ నేతలు.. సర్కారును తప్పుబట్టేంత స్థాయికి ఎదగడం చూస్తుంటే.. వారి అతి విశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

కేసీఆర్ పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చాడా వెంకట్ రెడ్డి అంటున్నారు. అలాగే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్నట్టు కూడా చెప్పారు. టీడీపీ, తెలంగాణ సమితితో కలిసి పని చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానంపై చర్చించినట్టు కూడా చెప్పారు. ఇలా.. ప్రత్యామ్నాయ విధానం అంటూనే.. ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుంటారో స్పష్టత ఇవ్వకుండానే.. 119 నియోజకవర్గాల్లో ఎలా పోటీ చేస్తారన్న విషం మాత్రం ఆయన తేల్చి చెప్పలేకపోయారు.

తోటి కమ్యూనిస్టు పార్టీ సీపీఐని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన తమ్మినేని వీరభద్రం.. ఇక చెప్పిన మాటను నిలబెట్టుకుంటాడని ఎలా నమ్మగలం? అధికారం కోసం ఇలాంటి దొంగ ఎత్తులు వేస్తూ.. జనంలో చులకన అవడమే కాదు. తనతో పాటు.. తన పార్టీని కూడా తమ్మినేని వీరభద్రం ఇలా బజార్లో పెడుతున్నాడు. పల్లె జనాల్లో కమ్యూనిస్టులపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాడు. అందుకే.. అడుగుతున్నాం. కేసీఆర్ పై వ్యతిరేకత నిరూపించు. లేదంటే.. రాజీకీయాల నుంచి అయినా తప్పుకో. దీనికి తమ్మినేని సమాధానం వచ్చే వరకూ జనాలు కూడా.. వెంట పడాల్సిందే.

Top