You are here
Home > Latest News > శ్మశానాలకు ఆధునిక హంగులు.. వీఐపీ ఘాట్‌లు!

శ్మశానాలకు ఆధునిక హంగులు.. వీఐపీ ఘాట్‌లు!

Spread the love
  • శ్మశానాలకు ఆధునిక హంగులు.. వీఐపీ ఘాట్‌లు!
  • హైదరాబాద్‌లోని శ్మశానాలకు ఆధునిక హంగులు అద్దుతున్నారు.

నగరంలోని మొత్తం 24 శ్మశాన వాటికలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆధునీకరిస్తోంది. వీటి అభివృద్ధికి మొత్తం రూ.24.12 కోట్లు ఖర్చుచేస్తోంది. ఇప్పటికే ఏడు శ్మశానాల్లో సగానికిపైగా పనులు పూర్తయ్యాయి. ఈ శ్మశాన వాటికలకు ఉన్న ప్రహారీ గోడలను పునర్‌నిర్మించారు. వ్యర్థాలను పడవేయడానికి ప్రత్యేకంగా ఒక ప్రాంతం, చితాభస్మాలను భద్రపరచడానికి స్టోర్‌రూంలు, ప్రార్థనా మందిరాలను ఈ శ్మశాన వాటికల్లో నిర్మిస్తున్నారు.

బల్కంపేట, పురానాపూల్, పంజాగుట్ట శ్మశాన వాటికల డిజైన్లు పూర్తయ్యాయని, తక్షణమే పనులు మొదలుపెడతామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. పంజాగుట్ట శ్మశాన వాటికను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ఆరు దహన వాటికలు, వీఐపీ ఘాట్, విశ్రాంతి భవనాల నిర్మాణపనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఎలక్ట్రిక్ దహన వాటికలు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. అలాగే బోర్‌వెల్‌ను కూడా ఏర్పాటుచేస్తామన్నారు.

Top