You are here
Home > Latest News > సంక్షేమం విషయంలో నిజంగా ఇందిరమ్మ పాలనే!

సంక్షేమం విషయంలో నిజంగా ఇందిరమ్మ పాలనే!

Spread the love

ఇందిర తరహాలో కేసీఆర్ పాలన: లక్ష్మణ్ 

సంక్షేమం విషయంలో నిజంగా ఇందిరమ్మ పాలనే!

  • బీజేపీ లక్ష్మణ్ నోట అసంకల్పితంగా సత్యవాక్కులు
  • కేసీఆర్ పాలనను పరోక్షంగా పొగిడిన పుష్పం
  • నిజమే చెప్పారంటూ నవ్విపోతున్న ప్రజానీకం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. అనుకోకుండానే నిజం చెప్పారని రాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఇందిరమ్మ తరహాలో కేసీఆర్ పాలన నడుస్తోందని ఓ కార్యక్రమంలో ఆయన అన్న మాటను స్వాగసిస్తున్నారు. గరీభీ హఠావో అంటూ ఆనాడు ఇందిరమ్మ చేసిన నినాదం ప్రకారమే.. రాష్ట్రంలో కేసీఆర్ పాలన నడుస్తోందని.. ఈ కారణంగానే పదేపదే టీఆర్ఎస్ నే గెలిపించుకుంటున్నామని చెబుతున్నారు.

ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన లక్ష్మణ్ తోపాటు.. మురళీధర్ రావు లాంటి కమలం పుష్పాలు.. కేసీఆర్ పాలనపై అవాకులు చెవాకులు పేలిన తీరుకు.. జనం కూడా అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. ఎలాగూ బీజేపీ వాళ్లు ఇచ్చిన హామీలు తీర్చరు.. నియామకాలు చేయరు.. మత కలహాలు ఆపరు.. పక్క పార్టీల వారిని చేర్చుకోకుండా బలపడరు.. పన్నుల పేరుతో జనాన్ని పీక్కు తింటారు.. ఇంతగా అరాచకం అలవాటైన ఆ పార్టీ నేతలు.. ఇక రాష్ట్రంలో అధికారం కోసం కలగంటే ఎలా స్వాగతిస్తామని జనం నిలదీస్తున్నారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా కేసీఆర్ చేస్తున్న పాలలను వక్రీకరిస్తే.. ఇకపై ఊరుకునేది లేదని కూడా ప్రజలు బీజేపీని హెచ్చరిస్తున్నారు. నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే.. రాష్ట్రంలో పాగా వేసినట్టు కాదని.. గతంలో గెలిచిన 5 సీట్లను కూడా శాసనసభ ఎన్నికల్లో దక్కించుకోలేకపోయిన అసమర్థతను గుర్తెరిగి బీజేపీ నేతలు మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. ఓడినా లక్ష్మణ్ కు బుద్ధి రాలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Top