You are here
Home > Latest News > సంక్షేమం.. TBGKS తోనే సాధ్యం

సంక్షేమం.. TBGKS తోనే సాధ్యం

Spread the love

హక్కుల సాధన.. వారసత్వ ఉద్యోగాల సాధన.. చేసిన శ్రమకు తగిన గుర్తింపు. ఇవన్నీ కావాలంటే.. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో.. TBGKS భారీ మెజారిటీతో గెలవాల్సిందే. ఎందుకంటే.. గతంలో ఏం చేశారని.. ఇతర పార్టీల అనుబంధ సంఘాలను గెలిపించుకోవాలి? ఓ వైపు వారసత్వ ఉద్యోగాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహరహం శ్రమిస్తుంటే.. ఆ ప్రయత్నాన్ని అడ్డగోలుగా అడ్డుకుంటూ.. తిరిగి మీరే తప్పు చేశారంటూ.. వంకర మాటలు మాట్లాడ్డం.. ప్రతిపక్ష పార్టీలకు ఈ మధ్య మామూలైపోయింది.

కార్మికుల శ్రమను ఇంతగా గుర్తించిన పార్టీలు గతంలో ఏవైనా ఉన్నాయా? సమ్మె చేసిన కాలాన్ని కూడా.. సెలవుగా పరిగణిస్తూ.. జీతం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా? అక్రమాలను, దగాను, కుట్రలను ఛేదించడంలో ముందు నిలిచి పోరాడిన సింగరేణి కార్మికులకు.. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినంతగా లాభాల్లో వాటాలు, బోనస్ మొత్తాల పెంపులు గతంలో ఏ ఒక్క ప్రభుత్వమైనా ఇచ్చిందా? ఇక్కడి సొత్తును పట్టుకుపోయి.. సీమాంధ్రను అభివృద్ధి చేసుకున్న దగుల్బాజీ ప్రభుత్వాలు టీడీపీ, కాంగ్రెస్ లవి. అలాంటి వాళ్లు వారసత్వ ఉద్యోగాలు సాధిస్తారట. ఎన్నికల్లో కార్మికులు వారిని గెలిపించాలట.

వింటే నవ్వుకోవడం తప్ప.. కార్మికులు ఏం చేయగలరు చెప్పండి. తప్పుడు మాటలు వినీ వినీ వారు కూడా.. విసిగిపోయారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు, గత ప్రభుత్వాలు, వారి అనుబంధ సంఘాలు చేసిన అక్రమాలు.. స్వార్థ పూరిత రాజకీయాలను భరించలేక.. తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు. అందుకే.. కార్మికుల ఎదురుచూపులు ఫలించి.. త్వరలోనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి.

సంక్షేమం చేసే కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరిచేందుకు.. కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఎన్నికల్లో గెలిపించేందుకు కార్మికులు ఎదురుచూస్తున్నారు. కానీ.. ఒక్కొక్కరినైనా తమ వైపునకు తిప్పుకునేందుకు విపక్షాలు.. తీవ్రస్థాయిలో విష రాజకీయాలు చేస్తున్నాయి. తమ మాటలతో మాయ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అందుకే… జాతీయ సంఘాల హామీలు నీటి మూటలని కార్మికులంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. అమూల్యమైన ఓటు హక్కుతో జాతీయ సంఘాల కుతంత్రాలను, టీడీపీ..కాంగ్రెస్ అనధికారిక కూటమి విష రాజకీయాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.

Top