You are here
Home > Latest News > సింగరేణి ప్రయివేటీకరణ కోరుకుంటున్న రేవంత్ రెడ్డి!

సింగరేణి ప్రయివేటీకరణ కోరుకుంటున్న రేవంత్ రెడ్డి!

Spread the love

మనసులో లేంది.. బయటికి రాదు అంటారు. నిప్పు లేనిదే పొగ రాదనీ చెబుతారు. ఇప్పుడు ఇవన్నీ.. టీడీపీ నేత రేవంత్ రెడ్డికి అచ్చంగా సరిపోతున్నాయి. సింగరేణిని ప్రయివేట్ పరం చేసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినా.. వారసత్వ ఉద్యోగాల రద్దుకు గతంలో జాతీయ సంఘాలు ఒప్పందాలు చేసుకున్నా.. ఒప్పందాలపై సంతకాలు చేసినా.. అదేదీ రేవంత్ రెడ్డికి పట్టడం లేదు. మనసులో ఆయనకు సింగరేణిని ప్రయివేటీకరణ చేయాలన్న సంకల్పం ఉన్నట్టుంది.

ఎందుకంటే.. రేవంత్ రెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు గత చరిత్ర చూస్తే.. ప్రయివేటైజేషన్ కు ఇచ్చిన ప్రాధాన్యత, ప్రయివేటు సంస్థలకు ఇచ్చిన ప్రోత్సాహకాలు గమనిస్తే.. వారి మనసుల్లో ప్రయివేట్ అంటే ఎంత ప్రాధాన్యం ఇస్తారన్నదీ అర్థమైపోతుంది. అందుకే.. రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో.. సింగరేణి ప్రయివేటీకరణ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. మేం చేయం.. చేయం.. సింగరేణిని ప్రయివేటు పరం చేయం అని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి నుంచి టీఆర్ఎస్ నాయకుల వరకూ అంతా చెబుతున్నా.. ఆ మాటను పట్టించుకోకుండా.. తప్పుడు కూతలు కూస్తున్నాడు.

రేవంత్ రెడ్డి చర్యలను గమనిస్తున్న కార్మికులు.. అసలు అలాంటి వాడిని పట్టించుకుంటే కదా.. మనం బాధపడాల్సింది.. అని తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. తప్పుడు రాజకీయాలు అలవాటైన రేవంత్ రెడ్డి మాటను నమ్మి మోసపోతే.. కేసీఆర్ నాయకత్వాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందని.. అప్పుడు సింగరేణి అంధకారం కాక తప్పదని కార్మికులే బహిరంగంగా చెబుతున్నారు. అలాంటి దగుల్బాజీని, అలాంటి దుర్మార్గుడిని నమ్మొద్దని.. నమ్మితే నట్టేట మునగడం ఖాయమని కార్మికులు స్పష్టంగా అభిప్రాయాన్ని చెబుతున్నారు.

వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. దుర్మార్గులు అడ్డుకుంటే.. న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. వారసత్వం కుదరకుంటే.. కారుణ్య నియామకాలు ఇస్తామన్నారు. లాభాల్లో వాటా పెంచారు. దీపావళి బోనస్ లు పెంచారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తున్నారు. మూడేళ్లుగా ఒక్క ఉద్యోగాన్ని కూడా పోగొట్టలేదు. పైగా.. 7 వేల ఉద్యోగాలు కూడా కల్పించారు. ఇదీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత. అందుకే.. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకే.. సింగరేణి కార్మికులు నిశ్చయించుకున్నారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను.. తరిమికొట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.

రేవంత్ రెడ్డిని మాత్రమే కాదు.. అతనితో కలిసి తిరుగుతున్న కాంగ్రెస్ నేతలను కూడా ఉరికించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న భట్టి విక్రమార్క లాంటి వాళ్లకూ బుద్ధి చెప్పపేందుకు రెడీ అయ్యారు.

Top