You are here
Home > News > సినిమా రంగంలో నువ్వు అవసరం కోమటిరెడ్డి ….

సినిమా రంగంలో నువ్వు అవసరం కోమటిరెడ్డి ….

Spread the love

కోమటిరెడ్డీ.. సినిమాల్లో ట్రై చెయ్.. పనికొస్తావ్!

వెనుక‌టికి నీలాంటోడే ఒక‌డు నేను రాజున‌వ్వ‌డం ఖాయం కానీ రాజ్యం ఎక్క‌డుందో మాత్రం తెల్వ‌దు అన్నడంటా.. గ‌ట్ల‌నే ఉంది నీ లెక్క కూడ.

ఇదేదో సినిమాల్లో ట్రై చెయ్యు కనీసం పైసలు అన్న వస్తాయి ఆలోచించు ….

అన్నీ తప్పుడు కూతలు.. అన్నీ తప్పుడు ప్రచారాలు. అధికార పార్టీలో కలకలం రేకెత్తించి.. దాంతో రాజకీయ ప్రయోజనం పొందేందుకు క్షుద్ర ప్రయత్నాలు. ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ లో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి. కాంగ్రెస్ లో ఎటు చూసినా.. పదవుల కోసం ఆరాటపడే చేసినట్టు కలలు కని.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి మాట్లాడేస్తుంటారు.. కాంగ్రెస్ పెద్దలు. ఇంత హీనమైన చరిత్రను సొంతం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు.. టీఆర్ఎస్ గురించి మాట్లాడుతుంటే నవ్వు రాక ఇంకేమొస్తుంది చెప్పండి.

అందునా.. కోమటిరెడ్డి లాంటి లాబీయింగ్ లీడర్లు.. పని చేతకాని నాయకులు.. పదవులపై.. అధికారంపై ఆరాటం చూపే నాయకులు.. టీఆర్ఎస్ ను విమర్శిస్తే.. అందునా హరీష్ రావు లాంటి కేసీఆర్ విధేయుడి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతుంటే.. అది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమాయకత్వం అని అనుకోవాల్సి వస్తోంది. హరీష్ రావు ఏంటి.. కాంగ్రెస్ లో చేరడం ఏంటి? ఏమైనా అర్థం ఉందా ఈ ఆలోచనలో? అలాంటి అవకాశమే లేనప్పుడు మరి కోమటిరెడ్డి ఎందుకిలా మాట్లాడుతున్నాడు అన్న అనుమానాన్ని మీకు మీరే కలగనీయబోకండి.

ఇప్పటికే చాలాసార్లు తన రాజకీయ భవిష్యత్తు గురించి హరీష్ రావు స్పష్టమైన ప్రకటనలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదనీ.. కేసీఆర్ ఆజ్ఞ ఎలా ఉంటే.. అలా నడచుకుంటానని చెప్పారు. అలాంటి హరీష్ రావు.. కేసీఆర్ ను విడిచి వెళ్లడం.. కాంగ్రెస్ లాంటి ప్రజా విశ్వాసం పోగొట్టుకున్న పార్టీలో చేరడం లాంటి పనులను.. చేస్తారు అనుకోవడం.. అది కోమటిరెడ్డి అత్యాశే తప్ప మరోటి కాదని జనం స్పష్టం చేస్తున్నారు.

ఇప్పటికన్నా ఇలాంటి మాటలు అనడం ఆపకుంటే.. రాజకీయంగా కోమటిరెడ్డిని అడ్రస్ లేకుండా చేస్తామని జనం కాంగ్రెస్  ను ఛీ కొట్టి మరీ చెబుతున్నారు.

Top