You are here
Home > Latest News > సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా భారీ అవయవదాన సంకల్ప కార్యక్రమం .

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా భారీ అవయవదాన సంకల్ప కార్యక్రమం .

Spread the love
  • సామాజిక స్పృహతో సేవా కార్యక్రమాలకు సిద్ధమైన కేసీఆర్ ఫాలోవర్స్
  • తమ వంతు సహకారినికి సిద్ధమైన జాగృతి, టీ న్యూస్- నమస్తే తెలంగాణ.
  • ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా 50 వేల మంది నుంచి…
  • అవయవదాన హామీ పత్రాల సేకరణే లక్ష్యంగా భారీ కార్యక్రమం.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. టీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు, తెలంగాణ జాగృతి, టీ న్యూస్, నమస్తే తెలంగాణ కలిసి భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ నెల 17న భారీ అవయవదాన కార్యక్రమానికి ప్లాన్ చేశారు. మొత్తం 31 జిల్లాల్లో 50 వేల మంది నుంచి అవయవదాన హామీ పత్రాలు సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ కు బర్త్ డే గిఫ్ట్ గా వీటిని అందించాలని అనుకుంటున్నారు. సామాజిక స్పృహ.. సాటివారికి సాయం ఇవే లక్ష్యంగా.. మంచి ఆలోచనకు బీజం వేశారు.

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ జాగృతి, టీ న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17న అవయవదాన సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 17న ఉద యం 9 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు

దేశంలో నిత్యం ఎంతోమంది అవయవలోపంతో బాధపడుతున్నారు. ప్రతీ పదిహేను నిమిషాలకొకరు యాక్సిడెంట్స్ ద్వారా అవయవాలు కోల్పోతున్నారు. ఇప్పటికే 12లక్షల మందికి పైగా అంధత్వంతో బాధపడుతున్నవారు ఉన్నారు. ఇవన్నీ గమనించిన కేసీఆర్ ఫాలోవర్స్.. తమ వంతు బాధ్యతగా కొందరికైనా సాయపడాలన్న ఉద్దేశంతో 17న అవయవదాన సంకల్పం చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ పై అభిమానం, సాటి వారికి సాయం చేయాలన్న ఉత్సుకత ఉన్న ప్రతీ ఒక్కరు ఇందులో భాగస్వామి కావొచ్చు.

యాక్సిడెంట్ లో ప్రాణం కోల్పోయినా.. బ్రెయిన్ డెడ్ అయినా.. ఆ వ్యక్తి నుంచి అవయవాలు సేకరించి తక్కువలో తక్కువ ఐదుగురి ప్రాణాలకు జీవం పోయవచ్చు. మన శరీరంలో ఉన్న వెలకట్టలేని అవయవాలను మట్టిలో కలపడం కంటే.. ఎట్ లీస్ట్ చనిపోయిన తర్వాత అయినా.. మరొకరికి సాయపడితే మీ జన్మధన్యం అయినట్లే. ఆలోచించండి.. అవయవదానానికి సిద్ధమవ్వండి. టీన్యూస్, జాగృతి, నమస్తే తెలంగాణ చేపట్టే అవయవదాన కార్యక్రమంలో హామీ పత్రం ఇవ్వండి.

Top