You are here
Home > Latest News > సీఎం క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అవుతుందా?

సీఎం క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అవుతుందా?

Spread the love
  • సీఎం క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అవుతుందా?
  • కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి…
  • ఇంటర్ ఫలితాలపై త్రిసభ్య కమిటీని ప్రభుత్వం వేసింది…
  • అసలేంజరిగిందో తెలియాలి కదా…
  • ప్రతిపక్షాలు కావాలని ఇలా తెలంగాణలో అల్లర్లు సృష్టిస్తున్నాయి..

కోతికి కొబ్బరి చిప్ప దొరికిందనుకోండి.. అది ఏం చేస్తుంది. దాని హడావుడి మామూలుగా ఉండదు. అప్పుడు అది ఎవరి మాటా వినదు. కానీ.. ఆ కొబ్బరి చిప్ప ఉన్నంత వరకే కోతి మొహంలో వెలుగు. ఆ కొబ్బరి చిప్ప అయిపోయాక… ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది. తెగ ఎగిరెగిరిపడుతున్నారు. తెలంగాణలో కావాలని అలజడులు సృష్టిస్తున్నారు. అసలు.. వీళ్లకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా చేయరు. అసలు..  వీళ్లకు తెలంగాణ ఏమైనా సంబంధం లేదు. ఏదో మాట వరుసకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు. అదే వీళ్ల స్వభావం. అది తెలంగాణ ప్రజలకు తెలిసిందేలే. కొత్తదేమీ కాదు కానీ.. ఇంటర్ వ్యవహారంపై అందరికంటే ఎక్కవగా కోపంగా ఉన్నది సీఎం కేసీఆరే. ఇంటర్ బోర్డులో అసలు ఏం జరిగింది.. అనే విషయాలు తెలుసుకోవాలి కదా. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. దానికి సీఎం కేసీఆర్ కూడా చాలా బాధ పడ్డారు.

విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని… రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కూడా ఉచితంగా చేయిస్తున్నామని… రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ తర్వాత మళ్లీ ఫ్రెష్ గా ఫలితాలు విడుదల చేస్తామని.. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఒక తండ్రిలా ధైర్యం చెప్పారు. విద్యార్థులకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇంటర్ ఫలితాలపై కమిటీని కూడా వేశారు. అసలు ఏం జరిగిందో తెలిస్తేనే కదా.. ఏవైనా చర్యలు తీసుకునేది. ఆ నివేదిక రాకముందే కాంగ్రెస్ నేతలు విద్యార్థులను, వాళ్లు తల్లిదండ్రులను ఉసిగొల్పి ఆందోళనలు, ధర్నాలు చేయిస్తే ఏమొస్తది. పోయిన విద్యార్థుల ప్రాణాలు తిరిగి వస్తయా? సీఎం క్షమాపణ చెప్పాలి అంటున్నారు.. సీఎం క్షమాపణ చెబితే.. జరిగిన తప్పు సరిదిద్దుకున్నట్టేనా? అసలు.. ఏం జరిగింది.. ఎలా జరిగింది.. ఇక ముందు ఇటువంటి తప్పులు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి.. అనే విషయాలపై మాట్లాడాలి కానీ.. అర్థం పర్థం లేకుండా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆందోళనపై యావత్ తెలంగాణ మండిపడుతోంది.

వాళ్లు కావాలనే దీన్ని పెద్దగా చేయాలని… తెలంగాణలో లేనిపోని అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. సీఎం కేసీఆర్ మీకు అండగా ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి డోకా లేదు. ఈ కాంగ్రెస్ నేతల మాటలు నమ్మకండి. 40 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఇంతకన్నా పెద్ద స్కామ్ లు జరిగాయి. వాళ్లు ఆ స్కామ్ లను సరిదిద్దుకున్న పాపాన కూడా పోలేదు. బోర్డుల్లో ఇంకా అవినీతి రాజ్యమేలుతోందంటే దానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. అందుకే.. సీఎం కేసీఆర్ ప్రతి డిపార్ట్ మెంట్ లో అవినీతి అనేదే లేకుండా చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు.

Top