You are here
Home > Latest News > సీపీఎం నేతలవి మాటలే.. కేసీఆర్ వి చేతలు!

సీపీఎం నేతలవి మాటలే.. కేసీఆర్ వి చేతలు!

Spread the love

ఎక్కడ న్యాయం జరగలేదండీ రాఘవులు గారూ.. సామాజిక న్యాయం? ఏ వర్గానికి అందడం లేదండ.. సామాజిక న్యాయం? నిరుపేదలుగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవడంలో విఫలం అవుతున్న అందరికీ.. సర్కారీ పథకాలు వర్తింపజేస్తూ.. వారికి కొత్త జీవితాలు పంచుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపైనే.. ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తుండడం.. రాఘవులు లాంటి సీనియర్ సీపీఎం నాయకులకు తగని పని.

వృద్ధులు.. మహిళలు.. ఒంటరి మహిళలు.. బాలింతలు.. గర్భిణులు.. అప్పుడే పుట్టిన పసి కందులు.. విద్యార్థులు.. రైతులు.. యువకులు.. ఇలా వారూ వీరూ అని లేదు. కులాల పట్టింపు లేదు. మతాల వ్యవహారమే లేదు. అందరికీ ఒకే న్యాయం.. అందరికీ ఒకే సూత్రం.. అదే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తారక మంత్రం. పథకాలను దర్జాగా అనుభవిస్తూ.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకుంటున్న జనాలు.. ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తాము కష్టాల్లో ఉన్నపుడు.. ఏ సీపీఎం నాయకుడు వచ్చి ఆదుకున్నాడని.. ఇప్పుడు అంతా సవ్యంగా ఉంటే అడ్డుకుంటున్నారని.. జనం ప్రశ్నిస్తున్నారు. రాఘవులు లాంటి నేతలు చేస్తున్న ఇలాంటి చిల్లర చేష్టలే.. సీపీఎం లాంటి పార్టీలను జనానికి దూరం చేస్తున్నాయి. నిజంగా అధికార వ్యవస్థలో లోపాలు ఉంటే చెప్పాలి తప్ప.. అనవసర విమర్శలు చేస్తే.. ఉన్న పాపులారిటీ కూడా పోతుంది.

ఈ విషయాన్ని రాఘవులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో.. అని సీపీఎం కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.

Top