You are here
Home > Latest News > సోయి తప్పి మాట్లాడుతున్న కోదండరాం …

సోయి తప్పి మాట్లాడుతున్న కోదండరాం …

Spread the love
  • అవునా.. నిజమా.. ఆ మాట ప్రజలను చెప్పమను!
  • పచ్చి అబద్ధాల కోరు కంటె.. మరీ హీనంగా మారిపోతున్నారు..
  • పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం.

ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా.. తనను నాయకుడిగా అంగీకరించకున్నా.. కోదండరాం ఈ మధ్య మరీ దిగజారిపోతున్నారు. విలువలు పోగొట్టుకుంటూ.. ప్రతిపక్షాల చేతిలో పావుగా మారి.. అబద్ధాలు చెబుతూ కాలం గడిపేస్తున్నారు. చేతనైతే మంచి చేయాలి.. లేదంటే నోరు మూస్కుని కూర్చోవాలి.. అంతే కానీ.. అన్ని వర్గాలను సంక్షేమం బాట పట్టిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని తిడితే.. తప్పుబడితే.. జనం ఊర్కుంటారా?

వాస్తవాలను కోదండరాం ఎప్పుడూ అంగీకరించరు. సంక్షేమ పథకాల తీరును గమనించరు. అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకూ.. చిన్నారుల నుంచి పండు ముసలివాళ్ల వరకూ.. దళిత గిరిజనుల నుంచి అగ్రవర్ణాల్లో నిరు పేదల వరకూ.. ఎంతని చెప్పాలి.. ఏమని చెప్పాలి.. కేసీఆర్ పాలన గురించి.. ఆయన చేస్తున్న సంక్షేమం గురించి. ఎన్నిసార్లు కోదండరాంకు అవగాహన కల్పిద్దామని ప్రయత్నిస్తున్నా.. ఆయన మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు.

ఏదో మాయ పట్టినట్టు.. ఏదో దయ్యం పట్టినట్టు.. ఆయన ప్రతిపక్షాల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయి.. తప్పుడు కామెంట్లు చేయడమే అలవాటుగా పెట్టుకున్నారు. రిటైర్ అయ్యారు కదా.. ఇప్పుడేం చేస్తున్నారు సార్ అని అడిగితే.. ప్రభుత్వాన్ని తిడుతూ అధికార దాహంతో కాలక్షేపం చేస్తున్నా అన్నట్టు తయారైంది.. ఆయన పరిస్థితి. ప్రభుత్వాన్ని తప్పుబడుతూ.. పోరాట ఫలాలు పేదలకు అందడం లేదని నోరు జారుతున్నారు.

ముందుగా యాదాద్రిని, తర్వాత వేములవాడను అభివృద్ధి చేస్తూ.. ఒక్కో ఆలయాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నా.. బాసరను పట్టించుకోవడం లేదంటూ.. అక్కసు వెళ్లగక్కుతూ.. ప్రాంతీయ విద్వేశాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు సార్ ఇంతలా మారిపోయారు? ఒకప్పుడు ప్రొఫెసర్ గా.. ఉద్యమంలో ప్రధాన పాత్రధారిగా చాలామందిని ముందుండి నడిపించిన మీరు.. ఇప్పుడు ఎందుకిలా దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారు?

ఇప్పటికన్నా మారండి సర్.. లేకపోతే.. మీ విలువను మీరే.. జనాల్లో తగ్గించుకుంటున్నవాళ్లవుతారు. అర్థం చేసుకోండి.

Top