You are here
Home > Latest News > సోయి లేకుండా మాట్లాడకు సోయం.

సోయి లేకుండా మాట్లాడకు సోయం.

Spread the love
  • సోయి లేకుండా మాట్లాడకు సోయం.
  • లక్షకు డబుల్ బెడ్రూం ఇళ్లు అమ్ముకుంటున్నారా?.
  • సోయం బాపూరావ్ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా?.
  • ఆధారాలుంటే చూపించు.. క్రిమినల్ కేసులు సర్కార్ పెడుతుంది.
  • ఎంపీ హోదాలో ఉండి.. చిల్లర విమర్శలు చేసి.. ఇజ్జత్ తీసుకోకు.

పేదోడి ఆత్మగౌరవం కోసం డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తోంది సర్కార్. అర్హులకు రూపాయి ఖర్చు కూడా లేకుండా ఇంటిని నిర్మించి ఇస్తోంది. కానీ.. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మాత్రం.. సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. లక్ష రూపాయలకు డబుల్ బెడ్రూం ఇళ్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నాడు. మిస్టర్ సోయం.. దమ్ముంటే నీ ఆరోపణలు నిరూపించు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే చూడు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లలో ఎలాంటి అక్రమాలకు చోటు లేదు. ఒకవేళ నిజంగా అమ్ముకుంటున్నట్లు తేలితే.. భేషజాలు లేకుండా క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం.

డబుల్ బెడ్రూం ఇళ్లలో ఎక్కడా అక్రమాలు అన్నవే లేవు. లబ్దిదారులకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం ఇళ్లు ఇస్తోంది. కానీ.. బీజేపీ నాయకులు పనికిమాలిన విరమ్శలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో తమ పరపతి పెంచుకునేందుకు పాదయాత్రలు చేస్తున్న సోయం.. సర్కార్ పై ఏవో విమర్శలు చేయాలని మాట్లాడుతున్నాడు. మొన్నటిదాకా అసలు ఒక్క డబుల్ బెడ్రూం కూడా కట్టలేదని మాట్లాడిన కమలం నేతలు.. ఇప్పుడేమో.. లక్షకు అమ్ముకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా.. ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉంటారు. మీరు పాదయాత్రలు చేసి.. పొర్లు దండాలు పెట్టినా బీజేపీని ఆదరించరు.

టీఆర్ఎస్ ను విమర్శించి.. లేనిపోని నిందలు వేసి.. తమ పరపతి పెంచుకోవాలన్నదే బీజేపీ ప్రయత్నం. కానీ.. కమలం వెర్రిపుష్పాలకు అర్థం కాని విషయం ఏంటంటే.. గ్రౌండ్ లెవల్లో మీకు అంత సీన్ లేదు. ఇప్పటికీ చెబుతున్నాం.. కొన్ని వందల గ్రామాల్లో బీజేపీ జెండా ఎగరడం లేదు. అటువంటిది.. మీ పార్టీకి, మీకు ప్రజల్లో ఆదరణ ఎలా ఉంటుంది. బీజేపీ విమర్శల్ని, పనికిమాలిన ఆరోపణల్ని ఎవరు పట్టించుకుంటారు?. ఇప్పటికైనా సోయి తెచ్చుకుని మాట్లాడటం నేర్చుకో.. సోయం బాపూరావ్.

Top