You are here
Home > Latest News > సోషల్ పోస్ట్ రాతలు …పాచి రాతల కంటే హీనంగా ఉన్నాయి …

సోషల్ పోస్ట్ రాతలు …పాచి రాతల కంటే హీనంగా ఉన్నాయి …

Spread the love

 

 

కెసిఆర్ ను వాళ్ళు ముంచేస్తున్నారా? అని ఒక తప్పుడు కథనం రాసింది సోషల్ పోస్ట్ ..???

ఈ కథనం అంతా తప్పుడు రాతలే …

తప్పులు చేస్తే.. ఇంతగా ఫలితాలు వస్తాయా?

ఎవరి మెప్పుకోసం ఈ రాతలు ..???

 

ఉన్నతాధికారుల పని తీరు సరిగా లేదని మీరు తెలివిగా మరో విష ప్రచారం చేస్తున్నారు కదా.. ఒకవేళ అదే నిజం అయితే.. క్షేత్ర స్థాయిలో పథకాల అమలు ఇంత భారీ స్థాయిలో ఎలా సాధ్యం అవుతుంది? ఇంతగా దేశాన్ని ఆకర్షించేలా పెట్టుబడులు ఎలా సాధ్యమవుతాయి? ప్రజల నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా.. పరిపాలన ఇంత ఉన్నతంగా ఎలా సాధ్యం అవుతుంది? వీటన్నిటికీ జవాబులు చెప్పలేని దగుల్బాజీలు.. మీరు.. ఉన్నతాధికారుల పనితీరును తప్పుబట్టడమా? మీరు.. అధికారుల పనితీరును శంకించడమా? నవ్వొస్తోంది.

అర్హత లేని వాళ్లు కూడా ఇలా మాట్లాడుతుంటే.. ప్రజలు కూడా బాధపడుతున్నారు. ప్రతిపక్షాలంటే.. వారికి పనీపాటా ఉండదు. కాలక్షేపం కోసం సవాలక్ష విమర్శలు చేస్తూ ఉండడం.. వారికి కామన్. కానీ.. ప్రభుత్వ పరిస్థితి అలా కాదు. తను చేసిన పనిని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయడం వారి బాధ్యత. ఎవరైనా తప్పులు ఎత్తి చూపిస్తే.. వాటిలో వాస్తవాలను వివరించడం ప్రభుత్వం పని.

సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లి.. ప్రజలందరికీ మేలు జరిగేలా చూడడం ప్రభుత్వ బాధ్యత. ఇప్పటికే గత ప్రభుత్వాలు దోచుకుతిన్న తెలంగాణను.. తిరిగి సంపన్న రాష్ట్రంగా మార్చడం.. ప్రభుత్వం చేస్తున్న పని. ఇందులో భాగంగానే.. 35 వేల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని సంక్షేమానికి కేటాయిస్తూ.. అన్ని వర్గాలనూ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూ.. దేశ వ్యాప్తంగా.. మోస్ట్ ఎమర్జింగ్ స్టేట్ గా ఎదుగుతోంది తెలంగాణ.

ఇన్ని ఘనతలు సాధించడం.. అధికారులు లేకుండానే.. వారు సరిగా పని చేయకుండానే సాధ్యం అవుతుందా? కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి అంటే.. అది విపక్షాల కుట్రలో భాగం. వారికి చెడ్డ పేరు వస్తుందన్న భయంతోనే.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని అడ్డుకుంటున్న దుర్మార్గపు ప్రతిపక్షాలు.. ఇష్యూను పక్కదారి పట్టించేందుకు తమ అనుకూల సోషల్ మీడియా శక్తులతో తప్పుడు కథనాలు రాయిస్తూ.. అధికారులపై కూడా విష ప్రచారానికి దిగుతున్నాయి.

ఇలా చేస్తే.. ప్రభుత్వానికి, అధికారులకు మధ్య గ్యాప్ వచ్చి.. అది తమకు ఉపయోగపడుతుందన్న భ్రమతో పాటు.. ప్రజలు భరించలేని భయంకర కుట్రకూ.. విపక్షాలు ఇలా తెర తీస్తున్నట్టు అనుమానం కలుగుతోంది. కానీ.. ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధితో పని చేస్తున్న ప్రభుత్వానికి.. అంతే చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు ఎప్పుడూ అండగానే ఉంటారు. వాస్తవమైన లెక్కలతో పథకాల అమలులో భాగమవుతారు.

విపక్షాల కుట్రల కారణంగా.. అప్పుడప్పుడూ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే.. సమన్వయంతో.. సమస్యలు పరిష్కరించుకుని ముందుకు పోతారు. ఎనీ డౌట్స్!

Top