You are here
Home > Latest News > హైదరాబాద్ ప్రజలను భయపెట్టి ఏం చేద్దామనుకుంటున్నావు లక్ష్మణ్..

హైదరాబాద్ ప్రజలను భయపెట్టి ఏం చేద్దామనుకుంటున్నావు లక్ష్మణ్..

Spread the love

 

  • హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డా అంటూ చెత్త మాటలు మాట్లాడుతున్నావు..
  • కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉగ్రవాదులను అరికట్టడానికి ఏం చేసింది..
  • హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించాలనుకుంటున్నావా లక్ష్మణ్?

నిజంగా తెలంగాణ సంక్షేమాన్ని కోరుకునేవాళ్లు ఎవరైనా.. తెలంగాణ ప్రజలు సంతోషంగా, ప్రశాంతంగా బతకాలని కోరుకుంటారు. అల్లర్లు సృష్టించి.. అలజడులు రేపి తెలంగాణను అల్లకల్లోలం చేయాలనుకునేవాళ్లను ఏమని పిలవాలి? ఇలా శాంతిభద్రతలను చెడగొట్టాలని చూసే వాళ్లను ఏం చేయాలో తెలంగాణ ప్రజలే చెప్పాలి. తెలంగాణ ప్రజలే వాళ్లను తరిమి తరిమి కొట్టాలి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా అదే కోవ కిందికి వస్తాడు. ఎందుకంటే.. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారుతున్నదట. లక్ష్మణ్ అంటున్నాడు. ఇదంతా దేనికోసం. ఎవరిని బదనాం చేద్దామని ఇలా మాట్లాడుతున్నావు లక్ష్మణ్. సిగ్గుండాలి. తెలంగాణ వ్యక్తివి అయి ఉండి తెలంగాణ సంక్షేమం కోసం పాటుపడకుండా తెలంగాణలో అలజడులు సృష్టించాలనుకునే నిన్ను ఏం చేయాలి?

తెలంగాణ ద్రోహులను ఈసారి తెలంగాణ నుంచి తరిమికొట్టడమే. అదే మీకు సరైనది. మీకు సిగ్గూ శరం రావాలి. తెలంగాణ ప్రజలే మిమ్మల్ని ఛీత్కరించుకుంటున్నా మీరు ఏమాత్రం మారడం లేదు. మళ్లీ అధికారం కోసం ఎగబడుతున్నారు. సిగ్గులేని ఎదవలు. తెలంగాణకు హాని తలపెట్టాలని ప్రయత్నిస్తే.. మీ సొంత కుటుంబానికి హాని తలపెట్టినట్టే. తెలంగాణ మనకు తల్లి లాంటిది. తల్లిని ఎలా కంటికి రెప్పలా కాపాడుకుంటామో.. మన రాష్ట్రాన్ని కూడా అలాగే కాపాడుకోవాలి కాని.. రాజకీయ దురుద్దేశంతో, సొంత లాభం కోసం తెలంగాణలో లేనిపోని అలజడులు సృష్టించి.. దానికి తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసి ఏం సాధిస్తారు. మీ కుయుక్తులన్నీ అధికారం కోసమేనని తెలంగాణ ప్రజలకు తెలుసు. మీ ఆటలు సాగవిక. మీరు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే.

Top