You are here
Home > Latest News > హౌలే వార్త‌లు ఎందుకురా ఆర్కే

హౌలే వార్త‌లు ఎందుకురా ఆర్కే

Spread the love
  • హౌలే వార్త‌లు ఎందుకురా ఆర్కే
  • ఎల్లో జ‌ర్న‌లిజానికి చిరునామాగా ఆంధ్ర‌జ్యోతి
  • వాతావ‌ర‌ణంలో మార్పుల‌తో జ్వరాలు
  • దానికి ప్ర‌భుత్వం ఏం చేస్తుంది బే
  • దేశం మొత్తం అదే పరిస్థితి ఉందిరా
రాష్ట్రానికి జ్వరమొచ్చింది.  ఏ ఇంట్లో చూసినా ఒకరో ఇద్దరో జ్వరం బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు! చలికి విపరీతమైన వణుకు.. తీవ్రంగా ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి.. కొందరికి వాంతులు, విరేచనాలు కూడా. అన్ని ఆస్పత్రుల్లో రోగుల కిటకిట. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ విబాగాల వద్ద చాంతాడంత క్యూలు.. నిలబడలేక, కూర్చోలేక నిస్త్రాణగా వాలిపోయే జ్వరపీడితుల దృశ్యాలే.
ఇదీ ఆంధ్ర‌జ్యోతి ప్ర‌ముఖంగా ప్ర‌చురించిన క‌థ‌నం. అరే ఔలే ఆర్కే… నీదెక్క‌డి జ‌ర్న‌లిజంరా ? ఎప్పుడైనా ఏ యేడాదైనా వాతావ‌ర‌ణంలో మార్పులు చోటుచేసుకోగానే జ్వ‌రాలు ప్ర‌బ‌ల‌డం స‌హ‌జం. అది ఒక్క తెలంగాణ‌లో కాదు… ఏ ప్రాంతంలోనైనా జ‌రిగేదే. వైర‌ల్ ఫీవ‌ర్ అంటే ఒంక‌రి నుండి ఒక‌రికి వ్యాపిస్తుంది. ఇంట్లో ఒక‌రికి జ్వ‌రం వ‌చ్చిందంటే అది మ‌రొక‌రికి సోకుతుంది. ఇక ఒళ్లు, కీళ్ల నొప్పులు, త‌ల‌నొప్పి, గొంతుఎ నొప్పి, వాంతులు, విరేచ‌నాలు ఇవ‌న్నీ స‌ర్వ‌సాధార‌ణం. మ‌రి ఇదేదో ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నం అయిన‌ట్లు ప్ర‌భుత్వ‌మే ద‌గ్గ‌రుండి మ‌రీ వ్యాధులు ప్ర‌బ‌లేలా చేస్తున్న‌ట్లు ఆంధ్రజ్యోతి రాసిన వార్త చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఆ ప‌త్రిక ఎంత అక్క‌సు పెంచుకుందో. వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాకాలంలో ఏటా జ్వరాలు సాధారణమే అంటూ రాస్తూనే… ఈసారి మాత్రం ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉందంటూ ప్ర‌చురించింది. అంటే సాధార‌ణంగా వ‌చ్చే వ్యాధుల‌ను ప్ర‌భుత్వమే సృష్టించింది అన్న‌ట్లుగా క‌థ‌నాన్ని మ‌లిచింది. అయితే ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లేందుకు చేసిన ప్ర‌య‌త్న‌మే అయినా.. ఇక్క‌డ ఆంధ్ర‌జ్యోతి ఒక విష‌యం మ‌ర్చిపోయింది. ఇన్నాళ్లూ స‌ర్కారీ వైద్య సేవ‌లు స‌రిగా లేవంటూ రాసిన స‌ద‌రు ఆంధ్ర‌జ్యోతిలోనే స‌ర్కారు ద‌వాఖాన‌ల‌కు రోగుల తాకిడి పెరిగిపోయింద‌ని పేర్కొంది. అంటే ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లో మెరుగైన సేవ‌లు ల‌భిస్తున్నాయ‌ని.. అందుకే రోగులు బాగా పెరిగార‌ని ఒప్పుకోక‌నే ఒప్పుకుంది. కానీ.. అంత‌లోనే న‌గ‌రంలో క‌లుషిత నీరు మంచినీటిలో క‌లుస్తోందంటూ పిచ్చి రాత‌లు రాసింది. వ‌ర్షాల కార‌ణంగా డ్రైనేజీలు పొంగి మంచినీటిలో క‌లిసిపోవ‌డంతో నీరు క‌లుషిత‌మైందని పేర్కొంది. అస‌లు సిటీలో ఈ ఏడాది ప‌డిన వ‌ర్షాలే త‌క్కువ‌. అప్పుడ‌ప్పుడే వాన‌లు అంతోఇంతో ప‌డ్డాయి. వారం రోజుల‌పాటు ముసురు ప‌ట్టింది. పైగా సిటీలో ఓపెన్ డ్రైనేజీలు ఉన్న‌ది చాలా త‌క్కువ ప్రాంతాల్లో. అలాంట‌ప్పుడు డ్రైనేజీ నీరు మంచినీటిలో క‌లువ‌డం ఎలా సాధ్యం ? ఇక సీజ‌న‌ల్ వ్యాదుల నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో వైద్యులు, సిబ్బంది సెల‌వుల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. కానీ.. అవి ఎక్క‌డా అమ‌లు కావ‌డం లేద‌ని త‌ప్పుడు రాత‌లు రాసింది. గ‌త మే నెల నుండి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో 43.67 లక్ష‌ల మంది రోగులు ఓపీ సేవ‌లు పొందిన‌ట్లు ఈ క‌థ‌నంలోనే రాశారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లోని వైద్యులు, సిబ్బంది సెల‌వుల్లో ఉంటే.. వీళ్లంద‌రికీ రాధాకృష్ణ‌తో పాటు ఆంధ్ర‌జ్యోతి సిబ్బంది, చంద్ర‌బాబు అండ్ కో వ‌చ్చి వైద్యం అందించారా ? ఙ‌క ఆరోగ్య శ్రీ లేక‌పోవ‌డంతో జ్వారాల‌తో వ‌స్తున్న రోగుల‌కు సేవ‌లు అంద‌డం లేద‌ని పిచ్చి రాత‌లు రాసింది. జ్వ‌రానికి ఆరోగ్య‌శ్రీ సేవ‌ల‌కు అస‌లు సంబంధ‌మేంటి ? అయినా న‌గ‌రంలో ఉస్మానియా, నిమ్స్‌, గాంధీ, నిలోఫ‌ర్ వంటి ఆస్ప‌త్రుల్లో ఉచిత సేవ‌లు అందిస్తుంటే.. ఇంకా ఆరోగ్య‌శ్రీ‌తో ప‌నేంటి రా యెద‌వా ?
Top