You are here
Home > National News > తాను ఓ పార్టీలో.. పెద్దోడు ఓ పార్టీలో.. చిన్నోడు మరో పార్టీలో..

తాను ఓ పార్టీలో.. పెద్దోడు ఓ పార్టీలో.. చిన్నోడు మరో పార్టీలో..

Spread the love

 

ఏ పార్టీనో తెలియనప్పుడు.. రాజీనామా చేయొచ్చుగా డీఎస్..?

– సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్న ఎంపీ ధర్మపురి శ్రీనివాస్

– తాను ఓ పార్టీలో.. పెద్దోడు ఓ పార్టీలో.. చిన్నోడు మరో పార్టీలో..

– ఆ కుటుంబమే ఓ చుక్కాని లేని రాజకీయ నావ అని జనం విమర్శ

ధర్మపురి శ్రీనివాస్. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి మంత్రి. పీసీసీ చీఫ్ గా 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన అనుభవం. తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కేసీఆర్ కు జై కొట్టారు. పార్టీలో రాజ్యసభ ఎంపీ స్థాయికి ఎదిగి సముచిత గౌరవాన్ని అందుకున్నారు. కానీ.. ఆయన ఇప్పుడేమంటున్నాడో తెలుసా? తాను ఏ పార్టీలో ఉన్నానో తెలియదంట. తను టీఆర్ఎస్ ఎంపీని అవునో కాదో.. కేసీఆర్ నే అడిగి తెలుసుకోవాల్నట.

అంత అనుభవం ఉండి.. ఇంత పెద్దరికం ఉండి.. డీఎస్ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? కాస్తైనా సిగ్గూ ఎగ్గూ ఉండక్కర్లా.. అని జనం విమర్శిస్తున్నారు. తనకు ఏ పార్టీలో ఉన్నదీ అర్థం కానప్పుడు.. ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా తక్షణం టీఆర్ఎస్ కు రాజీనామా చేయాలి.. అని ప్రజలు సవాల్ చేస్తున్నరు. అలా కాకుంటే.. తన అనుభవాన్ని గుర్తించైనా మర్యాదగా మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నరు. తప్పుడు కూతలు వద్దని బుద్ధి చెబుతున్నరు.

ఎక్కడ ఏ లాభం ఉన్నా వాడుకునేందుకు అనువుగా కొడుకులిద్దరినీ తలో పార్టీలోకి వెళ్లేలా చేయడం కాదు.. అసలు ముందు తన పార్టీ ఏంటో డిసైడ్ చేసుకుని పెద్దరికాన్ని కాపాడుకోవాలని జనం అంటున్నరు. డీఎస్.. స్పందించు. నీ చిన్న కొడుకు.. హామీలిచ్చి, విస్మరించి జనాన్ని మోసం చేస్తున్నతీరుపై మాట్లాడు. నీ పెద్ద కొడుకు.. గతంలో చేసిన పనుల గురించి, చిల్లర రాజకీయాల గురించి మాట్లాడు. కేసీఆర్ గురించి వెటకారపు మాటలు ఆపితే నీకే మంచిది.

నిన్ను గుర్తించి.. సముచిత స్థానం ఇచ్చి.. ఎంపీని చేసినందుకా.. కేసీఆర్ గురించి ఇలా మాట్లాడుతున్నవ్? కాస్తైనా సిగ్గూ ఎగ్గూ ఉండక్కర్లా? కొడుకులతో రాజకీయ వ్యభిచారం చేయిస్తూ.. నువ్వు పెద్ద మనిషిలా మేధావిలా పోజులు కొడతావా? డీఎస్.. వాస్తవాలు తెలుసుకో. పద్ధతిగా మాట్లాడు. నీకు నిజంగా రాజకీయాలు చేసేంత ధైర్యమే ఉంటే.. నిజమైన నాయకుడివే అయితే.. తక్షణం ఎంపీ పదవికి రాజీనామా చెయ్. ఆ తర్వాత మాట్లాడు.

Top