You are here
Home > Latest News > విశ్వనగర కల సాకారానికి 20 వేల కోట్లు : కేటీఆర్

విశ్వనగర కల సాకారానికి 20 వేల కోట్లు : కేటీఆర్

Spread the love
400 ఏళ్ల చారిత్ర‌క‌, సాంస్కృతిక న‌గ‌ర‌మైన హైద‌రాబాద్ న‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డానికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు రూపొందించిన ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తూ భారీ ప్రాజెక్ట్‌లు, అభివృద్ది కార్య‌క్ర‌మాల‌తో ముందుకు పోతోంది తెలంగాణ ప్రభుత్వం…
 
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ల‌క్ష రెండు ప‌డ‌క‌ల ఇళ్ల నిర్మాణం, స్ట్రాటిజిక్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం, వైట్‌టాపింగ్ రోడ్ల నిర్మాణం, చెరువుల సుంద‌రీక‌ర‌ణ‌, అన్న‌పూర్ణ భోజ‌న ప‌థ‌కం, స్వ‌చ్ఛ హైద‌రాబాద్ కార్య‌క్ర‌మాలు,
 
షీ-టాయిలెట్ల ఏర్పాటు, పార్కులు, మార్కెట్ల అభివృద్ది, క్రీడాభివృద్ది, పౌర‌సేవ‌ల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా అందించ‌డానికి సాంకేతిక ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీని పూర్తిస్థాయిలో ఉప‌యోగించుకోవ‌డం త‌దిత‌ర ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను పకడ్భందీగా చేపట్టింది తెలంగాణా ప్రభుత్వం ….
విశ్వనగర కల సాకారం త్వరలో అవుతుంది ….దానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది…. 
 =========================
ఈరోజు విశ్వ  నగర కల సాకారానికి మొత్తం రూ.20,146కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ గారు తెలిపారు.
 
మంత్రి గారు మాట్లాడుతూ… విద్యుత్‌ దీపాలు, నాలాల విస్తరణ ప్రాధాన్యతాంశాలని అన్నారు. మూసీ అభివృద్ది – సుందరీకరణ ప్రాధాన్యతాంశాలన్నారు.
 
రహదార్లకు రూ. 6,700 కోట్లు,
 
నీటి సరఫరాకు రూ. 2,926 కోట్లు,
 
మూసీ అభివృద్ధి కోసం రూ. 1,665 కోట్లు,
 
ఎల్‌ఈడీ బల్బుల కోసం రూ. 400 కోట్లు,
 
నాలాల విస్తరణకు రూ. 230 కోట్లు,
 
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ. 8,225 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
 
నగర అభివృద్ధికి మొత్తంగా రూ. 20,146 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు మంత్రి. అదనంగా రూ. 7 వేల కోట్లతో కేశవాపురం వద్ద తాగునీటి జలాశయ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. పనుల పురోగతిపై ప్రతి సోమవారం శాఖాధిపతులతో సమీక్షలు నిర్వహిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. దీపావళి వరకు నగరంలో ఎల్‌ఈడీ బల్బుల కార్యక్రమం పూర్తి అవుతుందన్నారు మంత్రి కేటీఆర్
Top