You are here
Home > Telangana > అర్చకులకు పే స్కేలు అమలు : సీఎం కేసీఆర్

అర్చకులకు పే స్కేలు అమలు : సీఎం కేసీఆర్

Spread the love
 • వచ్చే నవంబర్ నుంచి అమలు
 • 1వ తేదీనే వేతనాలు అందిస్తాం
 • మరో 3 వేల ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు
 • ఆలయ భూములను అన్యాక్రాంతం కానివ్వం
 • దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తగ్గిస్తాంరాష్ట్రంలోని అర్చకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక ఇచ్చారు. అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పే స్కేలు అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో అర్చకులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. వారి సమస్యలు, వేతనాల పెంపు, చెల్లింపులు, ఆలయాల నిర్వహణ, ధూపదీప నైవేద్యంతో పాటు తదితర అంశాలపై చర్చించారు.

  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వచ్చే నవంబర్ నుంచి అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పేస్కేలు అమలు చేస్తామని చెప్పారు. అర్చకులకు గౌరవ మర్యాదలు దక్కుతున్నా.. పూట గడవడమే కష్టంగా ఉందన్నారు. అర్చకులకు పిల్లను ఇచ్చేందుకు వెనుకాడుతున్నారని తెలిపారు. ఇక నుంచి 5,625 మంది అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు అందిస్తామని చెప్పారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందుతాయన్నారు. వేతన సవరణ అమలు చేసినప్పుడు దేవాలయ ఉద్యోగుల వేతనాలు కూడా సవరిస్తామన్నారు.

  ప్రస్తుత రాష్ట్రంలోని 1805 దేవాలయాల్లో అమలవుతున్న ధూప దీప నైవేద్య పథకాన్ని మరో 3 వేల దేవాలయాలకు వర్తింపు చేస్తామని తెలిపారు. దేవాలయాల నిర్వహణ, సంబంధిత అంశాల పర్యవేక్షణకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తగ్గిస్తామని చెప్పారు.

  ఆలయాల భూముల అన్యాక్రాంతంపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని గుర్తు చేశారు సీఎం. సమైక్య పాలనలో తెలంగాణకు ఈ అన్యాయం ఎక్కువగా జరిగిందన్నారు. తెలంగాణ ఆలయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో పుష్కరాలు సరిగా నిర్వహించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పుష్కరాలను అద్భుతంగా నిర్వహించామని సీఎం తెలిపారు.

Top