You are here
Home > Latest News > హన్మంతూ నీకు పదవి లేదు.చెప్పుకోదగ్గ పనులేవీ లేవు.ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అంత సీన్ లేదు.

హన్మంతూ నీకు పదవి లేదు.చెప్పుకోదగ్గ పనులేవీ లేవు.ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అంత సీన్ లేదు.

Spread the love
  • హన్మంతూ నీకు పదవి లేదు.చెప్పుకోదగ్గ పనులేవీ లేవు.ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అంత సీన్ లేదు.
  • కాలం కలిసివస్తే మరోసారి రాజ్యసభ సీట్ రావొచ్చు,దానికి హై కామాండ్ దయాదాక్షిణ్యాలు అవసరం.
  • వాళ్ళను మెప్పించడానికి,వాళ్ళ దృష్టిలో పడడానికి పడరాని పాట్లు పడుతున్నావు.

ఏదో ఒకటి చేసి మీడియా లో ఉండే ప్రయత్నం చేస్తున్నావు.నీవల్ల ఏమీ కాదు,ఊదు కాలదు,పీరి లేవదు.కాని ఏదో చేసేస్తున్నట్టు బిల్డప్ లు ఇచ్చి,రెండో రోజు పేపర్ లో వచ్చిన క్లిప్పింగులు,టీవీ లో వచ్చిన ఫూటేజీలను జమ చేసి హై కమాండ్ కు పంపుతావు.ఇదిగో ఈరోజు నేను ఈ ఘనకార్యం చేసిన అని చెప్పుకోవడానికి వారి కృపాకటాక్ష వీక్షణాల కోసం పరితపించే, గాంధీ,నెహ్రు భజన బృందానికి స్టేట్ ప్రెసిడెంట్,కాదు,కాదు నేషనల్ ప్రెసిడెంట్ వి.వాళ్లకు కూడా నీలాంటి వాళ్ళే కావాలి.సో క్లుప్తంగా ఇదీ నీ స్టోరి.

టీఆరెస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని చేయనందుకు కేసీఆర్ మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నావు.మీకు,అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో  పార్టీని గెలిపించే సత్తా ఉన్న నాయకుడు ఎవరూ లేరు.అందరూ వారి,వారి నియోజకవర్గాలలో మాత్రమే తురుంఖాన్ లు.ఇంతకాలం సీమాన్ద్రా నుండో,డిల్లీ నుండో ఎవరో ఒకరు వచ్చి మీ తరఫున ప్రచారం చేసి,మిమ్మల్ని గెలిపించి మీకు పదవిలో కూచోబెట్టి పోయేవారు.ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.కేసీఆర్ వచ్చి గెలిపిస్తాడు అన్న కలలన్నీ కల్లలైపోయాయి.అధికారంలోకి రావాలని అయితే ఉన్నది కాని,ఒక స్ట్రాటజీ అంటూ ఏమీలేదు.గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉన్నది వ్యవహారం అంతా.ఏమైనా అంటే కేసీఆర్ అవినేతికి పాల్పడుతున్నాడు,,అని చెవి కోసిన మేక లాగా అరుస్తావు,అవినీతి ఎక్కడ జరిగింది,ఎవరు చేసారు,అందులో ఎంత ప్రజాధనం దురుపయోగం అయ్యిందో చెప్పవు.ఊరికే అవినీతి,అవినీతి అని అరుస్తావు.అసలు అవినీతి,కుంభకోణాలు,స్కాం లు అని వేటిని అంటారో,అవి ఎవరు చేసారో నేను చెబుతాను.

UPA 2 హయాములో జరిగిన కోల్ గెట్ కుంభకోణం విలువ 186 లక్షల కోట్లు,ఇది కాగ్ తన రిపోర్ట్ లో చెప్పిన విషయం.ఇక టూ జీ స్పెక్ట్రం కుంభకోణం విలువ 176 లక్షల కోట్లు,ఇక కామన్ వెల్త్ గేమ్స్ స్కాం విలువ 70 వేల కోట్లు.అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ స్కాం అందులో సాక్ష్యాత్తు సోనియా గాంధీ ప్రమేయం ఉన్నట్టు ఇటాలియన్ కోర్టు చెప్పింది.ఇక మన అప్పటి ఉమ్మడి రాష్ట్రం లో జరిగిన జలయజ్ఞం కుంభకోణం,విలువ తొంభై వేల కోట్ల రూపాయలు.వోక్స్ వ్యాగన్ కుంభకోణం,ఇందిరమ్మ గృహాల కుంభకోణం,ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి,అసలు విషయం చెప్పడమే మరిచాను రాజీవ్ గాంధి హయాములో జరిగిన బోఫోర్స్ కుంభకోణం.వీటిని అవినీతి అని,ఇవి చేసిన వారిని అవినీతిపరులు అంటారు.ఇవన్నీ మీ పార్టీ వాళ్ళు చేసినవే.ముందు వీటికి చెప్పు సమాధానం,ఇలాంటి ఒక్క అభియోగం అయినా  కేసీఆర్ మీద ఉన్నదా?ఎందుకు అనవసరంగా గొంతు చించుకుంటావు?నయీం ను ముప్పొద్దులా మేపి మీకు కావాల్సిన పనులు చేయించుకున్న మీరు గొప్పోళ్ళా లేక అలాంటి సంఘవిద్రోహక శక్తిని మట్టుబెట్టిన మనిషి గొప్పోడా?

Top