You are here
Home > Latest News > నిరంకుశ ధోరణి ఎవరిది? నీదా.. ప్రభుత్వానిదా?

నిరంకుశ ధోరణి ఎవరిది? నీదా.. ప్రభుత్వానిదా?

Spread the love

నిరంకుశ ధోరణి ఎవరిది? నీదా.. ప్రభుత్వానిదా?

కోదండరాం.. నీకంటే ముందే.. ఉద్యమంలో నిరుద్యోగుల పాత్రను గుర్తించి.. వారి సంక్షేమానికి బాటలు పరుస్తున్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ.. స్వార్థానికి అలవాటుపడిన నువ్వు.. అధికార దాహంతో అలమటిస్తున్న నువ్వు.. కేసీఆర్ కు దక్కుతున్న జనాదారణ చూసి ఓర్వలేకపోతున్న నువ్వు.. అనవసరంగా నిరుద్యోగులను ఇప్పుడు వివాదంలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నావు. ఇది మంచిది కాదు కోదండరాం.

నువ్వు అంటున్నట్టు.. ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో ఏ మాత్రం నిరంకుశంగా లేదు. వారి బంగారు భవిష్యత్తుకు అవసరమైన బాటలు వేయడంలోనే కేసీఆర్ సర్కారు నిమగ్నమైంది. వరుసగా నోటిఫికేషన్లు ఇస్తుంటే.. న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తూ.. అడ్డుకుంటున్నది నువ్వు.. నీ కాంగ్రెస్ బ్యాచ్. అలాంటిది.. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం నిరంకుశంగా ఉందని నువ్వు ఎలా అనగలుగుతున్నావ్?

చెప్పినట్టుగా లక్ష ఉద్యోగాలు కాదు.. అంతకంటే ఎక్కువగానే ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఏనాడో చెప్పింది. శాఖల వారీగా ఉన్న ఖాళీలను కూడా సూచన ప్రాయంగా.. అనధికారికంగా వెల్లడించింది. వాటన్నిటినీ.. అనుకున్న సమయంలోపు పూర్తి చేస్తామని.. నిరుద్యోగులకు కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతున్నాయని పదే పదే స్పష్టం చేస్తోంది. వీలు కుదిరినప్పుడల్లా.. వందల సంఖ్యలో పోస్టుల భర్తీకి చర్యలు కూడా తీసుకుంటూనే ఉంది.

ఇదేదీ పట్టని నువ్వు.. నీ కాంగ్రెస్ బ్యాచ్ కలిసి.. నిరుద్యోగులను ఇలా రెచ్చగొడితే చూస్తూ ఊరుకునేది లేదు. మాట్లాడితే.. నాలుగు మంచి ముక్కలు చెప్పు. ప్రొఫెసర్ గా నీకు ఉన్న అనుభవాన్ని రంగరించి.. ఎలా చదువుకోవాలన్న విషయంలో విద్యార్థులకు సలహాలు ఇవ్వు. అంతే కానీ.. ఇలా వారిని రెచ్చగొట్టాలనుకుని ప్రయత్నాలు చేస్తూ.. వారిని నీ స్వార్థానికి ఉపయోగించుకోకు.

ఇప్పటికే అమరులను అవమానపరిచి.. తెలంగాణ చరిత్ర హీనుడిగా మిగిలిపోయిన నువ్వు.. ఇప్పుడు నిరుద్యోగులను నీ రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేయకు. వాళ్లు.. ఉద్యోగాల కోసం.. చిత్తశుద్ధితో చదువుకుంటున్నారు. వారిని ఇప్పుడు రూట్ మార్చి.. వారి జీవితాలను నాశనం చేయకు. వాస్తవాలు గ్రహించి.. సంక్షేమంలో భాగం అవ్వు.

Top