You are here
Home > Latest News > కేసీఆర్​ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేదు

కేసీఆర్​ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేదు

Spread the love

 

  • కేసీఆర్​ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేదు
  • వ్యాధి నియంత్రణ కోసం 24 గంటలూ అప్రమత్తం
  •  అత్యవసర వేళల్లో ప్రజలను ఆదుకోవడానికి రెడీ

కరోనా సోకుతుందేమోనన్న భయం ఒకటైతే.. ఆహారం, కూరగాయలు, మందులు, రేషన్​ దొరుకుతుందో లేదోననే భయం మరొకటి. ఎందుకంటే మారుమూల పల్లెల్లోనూ లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. ఉదాహరణకు వేరే ఊళ్లోని ఒక వ్యక్తి బంధువు చనిపోయాడనుకుందాం. బాధితులు కచ్చితంగా అంత్యక్రియలకు వెళ్లాలి. ఇంకొందరికి మెడికల్​ ఎమర్జెన్సీ రావొచ్చు. పురిటి నొప్పులు వచ్చేవాళ్లు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ల కోసం ప్రభుత్వం డయల్​ 100ను సిద్ధంగా ఉంచింది. దానికి ఫోన్​ చేస్తే ప్రత్యేక వాహనాన్ని తీసుకొచ్చి రవాణా సదుపాయం కల్పిస్తారు.

లేదా ప్రత్యామ్నాయ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. కచ్చితంగా వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే పోలీసులు పాసులు ఇస్తున్నారు. ఇక నిత్యవసరాల కోసం కుటుంబం నుంచి ఒకరు మాత్రమే బయటకు రావడానికి అనుమతి ఇస్తారు.  రెండుమూడు రోజులకు సరిపడేలా ఒకేసారి తెచ్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. 87.59 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారుల కుటుంబాలకు 12 కేజీల చొప్పున వీలైనంత త్వరగా బియ్యం అందిస్తారు.  రూ.1103 కోట్ల విలువైన 3,36,000 టన్నుల పైచిలుకు బియ్యం వీరికి ఉచితంగా ఇస్తారు. నిత్యవసరాలు కొనుగోలు చేయడానికి వీలుగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రూ.1500 చొప్పున ఇస్తారు.

ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నా, వ్యాధి సోకినా ప్రభుత్వమే పూర్తి ఉచితంగా ట్రీట్​మెంట్​ చేయిస్తుంది.  ప్రభుత్వ ఆఫీసులు కచ్చితగా నడవాలి కాబట్టి 20 శాతం ఉద్యోగులతో పనిచేయిస్తారు. విద్యుత్, ఆరోగ్య, అగ్నిమాపక వంటి అత్యవసర సర్వీసుల ఉద్యోగులు విధులకు హాజరవుతారు.  ప్రయివేటు ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యాలు జీతాలు చెల్లించాలని కేసీఆర్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.  అంగన్వాడీ కేంద్రాలు మూసివేసినా, అయితే, పిల్లలకు ఇబ్బందులు లేకుండా వారికి సరకులు అందిస్తారు.అయితే మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలంతా స్వీయ నియంత్రణలు పాటించడం తప్పనిసరి. మనల్ని మనం రక్షించుకోవడానికి సమాజమంతా ఏకం కావాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లకు పరిమితం కావాలి. లేకపోతే ప్రభుత్వం శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

 

 

 

 

 

Top