
ముఖ్యమంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారి విజయవాడ పర్యటన ఖరారైంది.
ఈ నెల 27న సీఎం కేసీఆర్‌గారు విజయవాడ వెళ్లనున్నారు.
పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించనున్నారు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని సీఎంగారు మొక్కుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సీఎం తెలంగాణ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్.. భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, స్వర్ణపత్రాలు, తిరుమల వెంకన్నకు స్వర్ణ సాలిగ్రామహారం, స్వర్ణ కంఠాభరణాలు, కురవి వీరభద్రుడికి బంగారు మీసం సమర్పించిన విషయం విదితమే.