You are here
Home > Latest News >
Spread the love

కోదండరాం నోట అబద్దాలు …

విన్నారా? విన్నారా? ముందు నవ్వు ఆపుకోండి. తెలంగాణ జన సమితి అనే కొత్త దుకాణం మొదలు పెట్టిన కోదండరాం జోకుల మీద జోకులు పేలుస్తున్నాడు. తమ పార్టీ పుట్టుకే పోరాటాలతో మొదలైందట. మరి ఇంత వరకూ ఆపోరాటాలు ఇచ్చిన ఫలితాలు ఏంటట? వీటికి మాత్రం ఆయన సమాధానం చెప్పలేడట. కానీ.. తమ పోరాటాలకు మాత్రం ప్రభుత్వం భయపడుతోందట.

ఇదీ.. కోదండరాం వరుస. స్థాయిని ఎక్కువగా ఊహించుకుంటే.. ఎంతటి మహామహులమంటూ విర్రవీగినా కూడా.. ఠక్కున పాతాళానికి పడేసే సత్తా ఉన్నవాళ్లు.. మన తెలంగాణ ప్రజలు. అరవై ఏళ్ల దాష్టీకాలను అణగదొక్కి.. సీమాంధ్ర పాలకులకు వారి ప్రాంతానికి తరిమి కొట్టిన ధీర వీరులు మన తెలంగాణ ప్రజలు. అలాంటి మన వాళ్లు.. ఇలాంటి కోదండరాం కుట్రలను గమనించలేరా? కచ్చితంగా గమనిస్తారు.

ఏ మాత్రం అణచివేత అన్న సమస్యే లేకున్నా కూడా.. తప్పుడు ప్రచారాలతో తమను తామే అణిచేసుకుంటూ.. ఆ తప్పును కేసీఆర్ పై వేసే ప్రయత్నం చేస్తున్న కోదండరాంకు.. జనాలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని ప్రభుత్వం మరిచిపోయిందని అంటున్న కోదండరాం.. ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పనులకు మాత్రం ఎందుకు స్పందించడం లేదో ఆయనకే తెలియాలి. ఈ విషయానికి కోదండరాం సిగ్గు పడాలి.

లేదంటే.. కోదండరాంకు సిగ్గు వచ్చేలా.. తీర్పు చెప్పేందుకు జనం ఎప్పుడో సిద్ధమయ్యారు.

Top