You are here
Home > Telangana > బయ్యారం ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పై స్పష్టమైన సమాచారం ఇవ్వడానికే కేటీఆర్ ప్రధానిని కలిశారు..

బయ్యారం ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పై స్పష్టమైన సమాచారం ఇవ్వడానికే కేటీఆర్ ప్రధానిని కలిశారు..

Spread the love
  • ఈ నెల 15 నే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కలిశారు..
  • ప్రధానిని కలిసి పది స్పష్టమైన ప్రతిపాదనలను ఆయన ముందుంచారు..
  • ఇది అందరికీ తెలిసిన సత్యమే.. ఇందులో దాయాల్సిందేముంది..

కొన్ని వెబ్ సైట్లు ఎటువంటి ఆధారం లేకుండా మిడిమిడి జ్ఞానంతో వార్తలు కుమ్మేశారు. వాళ్లకు కావాల్సింది నిజానిజాలు కాదు. తెలంగాణ ప్రజల సంక్షేమం అసలే కాదు. కేవలం హిట్స్  పెంచుకొని నాలుగు డబ్బులు సంపాదించుకోవడమే అటువంటి వెబ్ సైట్ల పరమావధి. అందుకే.. ఏవేవో వార్తలు రాస్తూ జనాలకు తప్పుడు సంకేతాలను పంపిస్తుంటారు.

మంత్రి కేటీఆర్ మీడియాకు భయపడుతున్నారని ఓ వైబ్ సైట్ కథనాన్ని కుమ్మేసింది.

ప్రధానిని కలవడానికి ముందే ఆయనతో ఏంఏం డిస్కస్ చేయబోతున్నారో ముందే తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారని.. ఇది మీడియాకు భయపడడమేనని, ఇంకా కేసీఆర్ కు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని.. ఇంకా ఏదేదో పిచ్చిపిచ్చిగా రాసింది. అసలు రాసినోడి తలకాయలో మెదడు లేనట్టుంది. నాయనా.. ఈ నెల 15నే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కలిశారనే విషయాన్ని నువ్వెలా మరిచిపోయావు. ఆయనను కలిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పది స్పష్టమైన ప్రతిపాదనలను ఆయన ముందుంచిన విషయం ఎరుగవా నువ్వు. అందులో బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్ కూడా ఉన్నాయి.

 

ఈ రెండు అంశాలపై మరింత స్పష్టమైన సమాచారం కావాలని ప్రధాని సీఎంను కోరారు. అందుకే.. ఆ రెండు శాఖలకు మంత్రిగా ఉన్న కేటీఆర్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రధానికి వీలైనంత త్వరగా ప్రధానికి అందించాలని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్.. ప్రధానిని కలిశారు. ఈ ప్రాజెక్టులు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. అందుకే కేటీఆర్ ముందే ప్రధాని వద్ద ఈ విషయాలను చర్చించడానికి వెళ్తున్న అని చెప్పారు. అంతే కాని.. మీడియాకు భయపడతున్నారు.. అంటూ పిచ్చిపిచ్చిగా రాస్తే.. మీకే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. ఉన్నది ఉన్నట్లు రాయండి.. లేనిది ఉన్నట్లు కల్పించడం, ఉన్నది లేనట్టు కల్పించి రాయకండి.. మీరే సమస్యల్లో ఇరుక్కుంటారు.

 

Top