You are here
Home > Latest News > విభజన హామీలపై టీఆర్ఎస్ కేంద్రంతో పోరాడుతూనే ఉన్నది శ్రీదర్ బాబు..

విభజన హామీలపై టీఆర్ఎస్ కేంద్రంతో పోరాడుతూనే ఉన్నది శ్రీదర్ బాబు..

Spread the love

 

  • తెలంగాణ సంక్షేమాన్ని కోరుకునే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ఏం చేసింది?
  • ఇన్నాళ్లూ మీకు విభజన హామీలు గుర్తుకురాలేదా?
  • ఎన్నికలు సమీపిస్తున్నాయని టీఆర్ఎస్ పార్టీపై బురద జల్లుతున్నారా?

విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఎన్నోసార్లు విన్నవించింది. కాని.. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలపై మొండిగా వ్యవహరిస్తున్నది.నాన్చుడు ధోరణీ ప్రదర్శిస్తున్నది. కేంద్రం నుంచి వాటికి పర్మిషన్ రావాలి. కాని.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఏమొస్తది? మీకు దమ్ముంటే, చేతనైతే వెళ్లి కేంద్రాన్ని నిలదీయండి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. టీఆర్ఎస్ పై నువ్వు ఫైర్ అయినంత మాత్రానా ఒరిగేది ఏమీ ఉండదు. అర్థమయిందా?

విభజన హామీల అమలుపై కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎందుకు నిలదీయలేకపోతుందని నువ్వంటున్నావు? మొన్న పార్లమెంటు వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీశారు. మరి.. నీకు ఆ విషయం తెలియదా బాబు. కావాలని టీఆర్ఎస్ పై ఎందుకు బురద జల్లడం. ఏం సాధిద్దామని? తెలంగాణ ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నారు? ఎందుకు అధికారం కోసం అంత వెంపర్లాట? అధికారంలోకి ఏం చేస్తారు? మళ్లీ తెలంగాణను దోచుకుతింటారా? తెలంగాణను ఇదివరకు నట్టేట ముంచారు? సిగ్గు లేకుండా అధికారం కోసం మళ్లీ ఎగబడుతున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ శ్రీధర్ బాబుకు ఇప్పుడు విభజన హామీలు గుర్తుకు వచ్చాయా? ఇన్నేండ్లు ఎక్కడికి పోయావు శ్రీధర్ బాబు. నాలుగేండ్ల తర్వాత ఇప్పుడు మైకు ముందు వాగుతున్నావు. సిగ్గుండాలి కొంచమైనా? రాజకీయ అవసరాల కోసం, స్వార్థ రాజకీయాలు చేసేది మీరు శ్రీధర్. నీకు, మీ పార్టీ నేతలకు నిజంగా దమ్ముంటే వెళ్లి కేంద్రాన్ని నిలదీయండి. లేకపోతే మీరు తెలంగాణ ద్రోహులుగానే మిగిలిపోతారు.

Top