You are here
Home > Uncategorized > సీఎం కేసీఆర్.. పట్టు వదలని విక్రమార్కుడు!

సీఎం కేసీఆర్.. పట్టు వదలని విక్రమార్కుడు!

Spread the love
 
పట్టు వదలని విక్రమార్కుడు ఎవరంటే.. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరును చెప్పేసేయొచ్చు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టు వదలకుండా పూర్తి చేయిస్తూ..రైతులకోసం కొత్త కొత్త పథకాలను తెచ్చి , ప్రజలకోసం కంటి వెలుగుని ప్రవేశపెట్టి అన్నింటికీ స్వీయ పర్యవేక్షణ చేస్తూ.. పనులను పరుగులు పెట్టిస్తూ.. అనుకున్న సమయానికే అన్ని పనులను పూర్తి చేసేందుకు స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు.
దానికి పెద్ద ఉదాహరణ జోనల వ్యవస్థకు ఆమోదం
ఇప్పుడు నడిచేది మన ముఖ్యమంత్రి, జన నాయకుడు కేసీఆర్ పాలన. అందుకే.. ఇచ్చిన హామీ ప్రకారం.. చెప్పిన మాట ప్రకారం..జోనల్ విధానానికి కేంద్ర పెద్దలను ఒప్పించి పట్టు వదలకుండా జోనల్ విధానానికి ఆమోద ముద్ర వేయించుకున్నారు ,,,
తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. నూతన జోనల్ విధానానికి ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో.. నేడు కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వెలువరించనుంది. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. కొత్త జోన్ల విధానంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చర్చించిన విషయం విదితమే. మొత్తానికి నూతన జోన్ల విషయంలో సీఎం కేసీఆర్ కృషి ఫలించింది.
 
నూతన జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే
తాజాగా రూపొందించిన జోనల్ వ్యవస్థలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల్లో 95శాతం స్థానిక రిజర్వేషన్ కల్పించారు. 5 శాతం మాత్రమే ఓపెన్ క్యాటగిరీ ఉంటుంది. స్థానికులు మెరిట్ సంపాదించుకొని ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం పొందే అవకాశం కల్పించారు. రాష్ట్ర క్యాడర్‌ను రద్దు చేయడంతో ఈ 5 శాతం ఓపెన్ క్యాటగిరీలోనూ తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగనున్నది. దీంతో ఉద్యోగాలన్నీ పూర్తిగా తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా చిన్న జిల్లాలను ఏర్పాటుచేసిన ప్రభు త్వం ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసింది.గత జోనల్ విధానాన్ని పరిశీలిస్తే..
గతంలో జిల్లా, జోనల్, రాష్ట్ర క్యాడర్‌పోస్టుల భర్తీలో కల్పించిన రిజర్వేషన్ల నిష్పత్తి వల్ల కూడా తెలంగాణలోని నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. జిల్లా పోస్టుల్లో 80 శాతం లోకల్, 20 శాతం ఓపెన్, జోనల్ పోస్టుల్లో 70 శాతం లోకల్, 30 శాతం ఓపెన్, జోనల్ గెజిటెడ్ పోస్టుల్లో 60 శాతం లోకల్, 40 శాతం ఓపెన్ క్యాటగిరీ రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రస్థాయి పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్ లేదు. దీనికితోడు ఓపెన్ క్యాటగిరీకి నాన్‌లోకల్ అని పేరు తగిలించి స్థానికేతరులే ఉద్యోగాలను కొల్లగొట్టారు. స్థానికులైన మెరిట్ అభ్యర్థులకు కూడా లోకల్ రిజర్వేషన్‌లోనే ఉద్యోగాలు కేటాయించారు. రాష్ట్రస్థాయి పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్లు లేకపోవడంతో తీరని నష్టం జరిగింది.

Top