You are here
Home > Latest News >
Spread the love

 

  1. కాంగ్రెస్‌ను దాని మేనిఫెస్టోను ప్రజలు బొంద పెడతారు..
  2. దశాబ్దాలు పాలించి తెలంగాణను ఎందుకు అభివృద్ధి చేయలేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి..
  3. అభివృద్ధి చేయమని అధికారం ఇస్తే.. ఎందుకు దోచుకున్నారో చెప్పాలి..
అవును.. ఐదేళ్లు పరిపాలించాలని ప్రజలు అధికారం ఇచ్చారు. కానీ.. మీరేం చేశారు.. తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నారు. ప్రతి దాంట్లో పుల్లలు పెట్టారు. ఎక్కడికక్కడ ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేశారు. సంక్షేమ పథకాలను అణగారిన వర్గాలకు అందకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ అభివృద్ధి చెందడం కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారు మీరు దామోదర రాజనరసింహ. ఇలాంటి తెలంగాణ ద్రోహులను తెలంగాణ నుంచి తరిమి కొడితే కాని.. తెలంగాణ బాగు పడదు. తెలంగాణ ప్రశాంతంగా ఉండదు. అందుకే కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలంటే తెలంగాణ ప్రజలే కరెక్ట్. తమ ఓటు హక్కుతో కాంగ్రెస్ ను తెలంగాణ నుంచే తరిమేస్తరు. అప్పుడన్నా తెలంగాణను ప్రశాంతంగా అభివృద్ధి చేసుకోవచ్చు.
మీరు మీ మేనిఫెస్టోలో ఎన్ని అంశాలను చేర్చినా.. తమ్మిని బమ్మి చేసినా.. బమ్మిని తమ్మి చేసినా.. మోసపూరిత హామీలను ఇచ్చినా.. మభ్య పెట్టే మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఇంకా నమ్ముతారనుకుంటున్నావా? మీ మేనిఫెస్టోను తీసుకెళ్లి గంగలో కలపండి. తెలంగాణ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. మీ పనికిమాలిన, అమలుకు నోచుకోని హామీలు కాదు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి చేయందిస్తారు. కానీ.. అభివృద్ధికి అడ్డుపుల్లలు వేస్తున్నారు. మీరు దోచుకుతిన్న తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే మీకు కళ్లు కుడుతున్నాయి. ఇప్పుడు మీరు మీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను ఇదివరకే ఎందుకు అమలు చేయలేదు. ఎందుకు హామీలను విస్మరించారు. మీకు నిజంగా తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే తెలంగాణను ఎప్పుడో అభివృద్ధి చేసి ఉండేవారు. కానీ.. మీకు తెలంగాణపై ఉన్నది కపటప్రేమ. తెలంగాణ ప్రజలు ఆమాత్రం అర్థం చేసుకోలేరనుకున్నావా? మీ బతుకులు ఇక బస్టాండే దామోదరా?
Top