You are here
Home > Latest News > మీ నాయనా చెప్పిండా అరవిందూ.. ఇలా మాట్లాడాలని??

మీ నాయనా చెప్పిండా అరవిందూ.. ఇలా మాట్లాడాలని??

Spread the love

 

స్వచ్ఛభారత్ నిధులు మళ్లించారు: ధర్మపురి అరవింద్

మీ నాయనా చెప్పిండా అరవిందూ.. ఇలా మాట్లాడాలని??

  • లోక్ సభ సాక్షిగా బీజేపీ ఎంపీ అబద్ధాలు
  • ఆరోపణలకు ఆధారాలు చూపించలేని అసమర్థత
  • తండ్రి బాటలోనే నడుస్తూ విమర్శలపాలవుతున్న తీరు

అప్పట్లో డీఎస్ అని ఒకరుండేవారు. పీసీసీ చీఫ్ గా.. రాష్ట్ర మంత్రిగా పనిచేసి.. విభజన అనంతరం అధికార తెరాస గూటికి చేరి.. రాజ్యసభ సభ్యత్వం పొంది.. ఆఖరికి నిజామాబాద్ కేంద్రంగా సొంత పార్టీకి నమ్మకద్రోహం చేసి.. తన భవిష్యత్తును తానే శూన్యం చేసుకున్న నేతగా.. ఆయన చరిత్రపుటల్లో చోటు సంపాదించారు. ఇప్పుడు ఆయన తనయుడు అరవింద్.. బీజేపీ ఎంపీగా.. తండ్రిని మించిన తనయుడి రీతిలో విష ప్రచారం కొనసాగిస్తున్నారు.

మనసులో తండ్రి పెంచిన విద్వేషమో.. లేక బీజేపీ కుట్రలు అలవరిచిన మూర్ఖత్వమో తెలియదు కానీ.. ధర్మపురి అరవింద్ అనే ఈ నిజామాబాద్ ఎంపీ.. లోక్ సభలో కారుకూతలు కూశాడు. రాష్ట్రంలో స్వచ్ఛ్ భారత్ నిధులను దారి మళ్లించారని ఆరోపించాడు. కానీ.. అందుకు సంబంధించిన ఆధారాలు చూపించడం మరిచి.. తన లేకితనాన్ని బయటపెట్టుకున్నాడు.

ఓ సీనియర్ నాయకుడు కుమారుడుగా.. ఇలాంటి తీరు సరైందేనా అని నిజామాబాద్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహిళలకు కేసీఆర్ కిట్ నుంచి.. పింఛన్ల వరకూ సమస్త పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం తగునా అని నిలదీస్తున్నారు. ఎంపీగా గెలిపించినందుకు.. చేతనైతే నియోజకవర్గ అభివృద్ధికి ప్రయత్నించాలని కానీ.. ఇలా తమకు కాలే పనులు చేస్తే.. అరవింద్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Top