You are here
Home > Latest News >
Spread the love

 

  • విమోచన దినోత్సవం త‌రువాత.. ముందు నిధుల సంగ‌తి తేల్చండి
  • తెలంగాణ ప్రేమ ఉంటే బీజేపీ నాయ‌కులు కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలి
  • అది చేత‌గాక పోతే అన్నీ మూసుకొని ప‌డుండాలి
  • సెప్టెంబ‌రు 17పై భిన్నాభిప్రాలు ఉన్నాయి కాబ‌ట్టి తెరాస త‌ట‌స్థంగా ఉంది

నిజాయ‌తీగా, నిర్మొహ‌మాటంగా మాట్లాడుకుందాం. సెప్టెంబ‌రు 17న విమోచ‌న దినోత్స‌వం నిర్వ‌హించ‌కుంటే కొంప‌లంటుకుపోతాయా ? తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందా ? విలీనం అంటే కొంద‌రికి బాధ‌. విమోచ‌నం అంటే మ‌రికొంద‌రికి నొప్పి. ఇటువంటి ప‌రిస్థితుల్లో కేసీఆర్ ప్ర‌భుత్వం ఏం నిర్ణ‌యం తీసుకోగ‌ల‌దు ? క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం.. విడువమంటే పాముకు కోపం. అత్యంత సున్నిత వ్య‌వ‌హారంగా మారిన‌ సెప్టెంబ‌రు 17పై తెరాస త‌ట‌స్థ వైఖ‌రి తీసుకుంది. ఏ ప‌క్షాన్ని స‌మ‌ర్థించ‌డం లేదు. విమ‌ర్శించ‌డ‌మూ లేదు. ప్ర‌జ‌ల‌కు ఏదైనా మేలు చేసే అంశంపై మాట్లాడ‌రు కానీ ఇలాంటి విష‌యాల‌పై మాత్రం బీజేపీ స‌న్నాసులు ర‌చ్చ‌ర‌చ్చ చేస్తారు. ఈ విషయమై ఒకాయన అంధజోతిలో మంగళవారం పేద్ద వ్యాసం రాశాడు. కచ్చితంగా విమోచన దినం నిర్వహించాలట.

 

అరేయ్ భాయి.. కేంద్రం మ‌న‌కు అన్యాయం చేస్తున్న‌ది. నిధులు ఇవ్వ‌డం లేదు. హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ప్రాజెక్టుల‌ను త‌న్నుకుపోతున్న‌ది. కాళేశ్వ‌రానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వ‌డం లేదు. ఇలాంటి విష‌యాల‌పై మాట్లాడండి. కేంద్రాన్ని నిల‌దీయాలంటే ఇక్క‌డి బీజేపీ నాయ‌కుల‌కు నోరు లేవ‌దు. అస‌లు వీళ్ల‌తో ఏమీ కాదు. మోడీ ద‌గ్గ‌రికి వెళ్లి సాష్టాంగ‌ప‌డ‌టం త‌ప్ప‌! ఊదు కాల‌దు పీరి లేవ‌దు. విమోచన దినోత్సవం అంటూ డిమాండ్ చేసేది కూడా తెలంగాణ అమ‌ర‌వీరుల‌పై ప్రేమ‌తో కాదు. రెండు మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్ట‌డానికే ఈ ప్ర‌య‌త్నం. సెప్టెంబర్ 17ను ఎట్లా చూడాలన్న అంశంపై తెలంగాణ సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉద్యమకాలం నుంచే ఉన్నాయి. తెలంగాణ వాదులు సెప్టెంబర్ 17ను విలీనం, విమోచన, ఆక్రమణ, విముక్తి వంటి భిన్న పదాలతో వర్ణించారు.

 

ఏదేమైనా ఆ రోజు న అప్పటివరకు స్వతంత్ర సంస్థానంగా ఉన్న హైదరాబాద్ రాజ్యం భార త యూనియన్‌లో విలీనమైందనేది కాదనలేని సత్యం. విమోచన, విముక్తి అనేటువంటి వ్యక్తీకరణలు సెప్టెంబర్ 17కు ఆపాదించడం సరైంది కాదనేది తెలంగాణలోని చాలామంది చరిత్రకారుల, మేధావుల అభిప్రాయం. నిజానికి సమకాలీన చరిత్రకారులు, వ్యాఖ్యాతలు, భారత ప్రభు త్వం, భారత సైన్యం ఎవరూ కూడా ఆ సంఘటనను విమోచనగా, విముక్తిగా పేర్కొనలేదు. అందుకే తెరాస త‌ట‌స్థ వైఖ‌రి తీసుకుంది.

Top