You are here
Home > Latest News > ప్రజల ఆదరణతోనే కేసీఆర్ సీఎం అయ్యారు నారాయణ.

ప్రజల ఆదరణతోనే కేసీఆర్ సీఎం అయ్యారు నారాయణ.

Spread the love
  • ప్రజల ఆదరణతోనే కేసీఆర్ సీఎం అయ్యారు నారాయణ.
  • మానవహక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగింది నిరూపించు.
  • సమ్మెను అణచేయాలని కుట్ర చేస్తే.. 15రోజులుగా ఎందుకు జరుగుతుంది.
  • పచ్చి అబద్ధాలతో పనికిమాలిన ప్రచారం చేస్తున్నారు.
  • NHRCకి కంప్లైంట్ చేసేంత ఉందా తెలంగాణలో పరిస్థితి.

సీపీఐ నారాయణ….తన ఉనికిని చాటుకునేందుకు టీఆర్ఎస్ పై, సీఎం కేసీఆర్ పై బురద జల్లుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సాకుగా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. కార్మికులు చట్టానికి లోబడే సమ్మె చేస్తున్నారు అంటున్న నారాయణ.. పండుగ పూట ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఏ చట్టంలో రాసి ఉంది. కార్మికులవి న్యాయమైన డిమాండ్లయితే.. నెల రోజుల సమయం ఇవ్వాలని ఐఏఎస్ ల కమిటీ అడిగింది కదా?. ఎందుకు వినకుండా మూర్ఖంగా సమ్మె చేస్తున్నారు. రెండు వారాలుగా ప్రజల ఇబ్బందులు నీ కళ్లకు కనిపించడం లేదా నారాయణ.

ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ప్రత్యామ్నాయంగా కొన్ని బస్సులైనా నడుపుతూ ప్రజల్ని గమ్యస్థానాలకు చేరుస్తోంది సర్కార్. సమ్మెను అణచేసే కుట్ర జరుగుతోందని.. మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని మాట్లాడుతున్న నారాయణ అందుకు తగిన ఆధారాలు చూపాలి. ప్రభుత్వం ఆ తీరుగ వ్యవహరిస్తే.. 14రోజులుగా సమ్మె జరిగేదా?. ఇవాళ రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించేవారా?. కార్మికులే.. కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లను బెదిరిస్తూ విధులకు రాకుండా చేస్తున్నారు. సమ్మె చేసే వాళ్లు శాంతియుతంగా చేసుకోవాలి. కానీ.. ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు, బస్సుల మీద దాడులు ఎందుకు చేస్తున్నారు?. సమస్యలు పరిష్కరించాలంటే ఆగ్రహం పనికిరాదు నారాయణ.. ఆలోచన కావాలి.

నిన్న హైకోర్ట్ కు ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. కార్మికుల గొంతెమ్మ కోర్కెలు తీర్చడం ఇప్పటికిప్పుడు అసాధ్యమని రిపోర్ట్ ఇచ్చింది. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరితే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తుంది. కాదని బెట్టు చేస్తే సర్కార్ సైతం మెట్టు దిగదు. సర్కార్ కింద పనిచేసే కార్మికులకే అంత ఉంటే.. ప్రభుత్వానికి ఎంతుండాలి??.

 

Top