You are here
Home > Digital Telangana > వెల్​డన్ కేసీఆర్​​ సర్​… బీజేపీకి సింహస్వప్నం

వెల్​డన్ కేసీఆర్​​ సర్​… బీజేపీకి సింహస్వప్నం

Spread the love

వెల్​డన్ కేసీఆర్​​ సర్​…

బీజేపీకి సింహస్వప్నం

రాజకీయ వ్యూహాలతో షాక్​ల మీద షాక్​లు

 

వర్తమాన రాజకీయాల్లో కేసీఆర్​ అంతటి రాజకీయ చతురత, వ్యూహరచన సామర్థ్యం,  ప్రత్యర్థి వ్యూహాలను ముందుగానే గుర్తించి తదనుగుణంగా ప్లాన్లు వేసే సత్తా వేరే ఎవరికీ లేదని బల్లగుద్దీ మరీ చెప్పవచ్చు. వివిధ జాతీయ, రాష్ట్రీయ అంశాల్లో ఆయన స్పందన, నిర్ణయాలు అద్భుతంగా ఉంటున్నాయి. కేంద్రం ఎంత వేధిస్తున్నా, నిధులు ఇవ్వకుండా సత్తాయిస్తున్నప్పటికీ, రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్న సీఎం మరొకరు లేరు. చివరికి రాజకీయ శత్రువులు సైతం కేసీఆర్​ నిర్ణయాలను రహస్యంగానైనా మెచ్చుకుంటారు. ఇలాంటి నాయకుడి గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కలిగిన మన చెత్త మీడియా ఎంతసేపూ ఏపీలోని నీచ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తుంది. ఆంధ్రభూమి వంటి చిన్న పత్రిక మాత్రం ఈ విషయాన్ని బాగా ఎలివేట్​ చేసింది.

సోమవారం ఇదే విషయమై మంచి స్టోరీని ఎనలిటికల్​గా ఇచ్చింది. ఈ పత్రిక సమయస్ఫూర్తిని మెచ్చుకోవాలి. ఈ కథనం ఇలా సాగింది. ‘‘రాజకీయ చతురతకు జాతీయ, ప్రాంతీయ స్థాయి రాజకీయ పార్టీలు నోరెళ్లబెడుతున్నాయి. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ తన ఇమేజీని కాపాడుకుంటారు. జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్న పౌరసత్వ చట్ట సవరణ అంశంలో కేసీఆర్ అనుసరించిన వైఖరిని చూసి కాంగ్రెస్ పార్టీ కూడా మూర్ఛపోయింది. దేశంలో మైనారిటీలు ఎక్కువగా ఉండే నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ జనాభాలో 30 శాతం మంది మైనారిటీలు ఉన్నారు. పౌరసత్వ చట్టం సవరణ వల్ల భారతీయులకు ఎవరికీ నష్టం కలిగించేది కాదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు. కానీ ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే జాతీయస్థాయిలో బీజేపీయేతర కొన్ని పార్టీలు అలజడి, ఆందోళనలు సృష్టించాలన్న నిర్ణయంతో ఉన్నట్లు కేసీఆర్‌కు ముందుగానే బలమైన సమాచారం ఉంది. ఈ సమాచారం టీఆర్‌ఎస్ మిత్రుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ద్వారా అంది ఉండవచ్చు.

ఈ బిల్లుకు టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందని అందరూ అనుకున్నారు. చివరి నిమిషంలో లైన్ మార్చుకుని బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఓటు వేసింది. ఈ ఏడాది 370వ అధికరణ రద్దు, త్రిపుల్ తలాక్‌కు అనుకూలంగా టీఆర్‌ఎస్ ఓటు వేసింది. ఈ రెండింటినీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. టీఆర్‌ఎస్ మాత్రం మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలో బీజేపీతో వైరం ఉన్నా, జాతీయ రాజకీయాలు వచ్చేసరికి బీజేపీతో సఖ్యతతోనే కేసీఆర్ ఉంటున్నారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశ వ్యాప్తంగా కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏమి చేయాలో తెలియక చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక ఉద్యమాలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు శాంతియుతంగా జరిగాయి. హైదరాబాద్‌లో చార్మినార్ వద్ద భారీ ఎత్తున ర్యాలీలు ఉంటాయని, గొడవలు ఉంటాయనే రీతిలో జాతీయ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ చార్మినార్ వద్ద శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత శాంతియుతంగా ప్రదర్శనలు జరిగాయి. గత వారం రోజులుగా కూడా అనేక మైనారిటీ విద్యా సంస్థల్లో కూడా నిరసనలు శాంతియుతంగానే జరిగాయి. తాజా పరిణామాలను మదింపు వేయడంలో కేసీఆర్‌కు సాటి వచ్చే నేత ప్రస్తుతం దేశంలో మరొకరు లేరని చెప్పవచ్చు”అంటూ ముగిసింది. కేసీఆర్​ రాజకీయ పరిణతిని అద్భుతంగా విశ్లేషించిన ఆంధ్రభూమిని మెచ్చుకోకుండా ఉండలేం. దీనిని చూసైనా ఆంధ్రా పత్రికలు బుద్ధి తెచ్చుకోవాలి.

Top