You are here
Home > Latest News > నిన్ను ప్రజలు ఎందుకు ఓడించారో అందరికీ తెలుసు

నిన్ను ప్రజలు ఎందుకు ఓడించారో అందరికీ తెలుసు

Spread the love

 

  • నువ్వేందో.. నీ పార్టీ గతమేందో తెలంగాణ మొత్తం తెలుసు అద్దంకి దయాకర్
  • నిన్ను ప్రజలు ఎందుకు ఓడించారో అందరికీ తెలుసు
  • మంత్రి కేటీఆర్ ను విమర్శించే స్థాయా నీది?
  • యూట్యూబ్ చానెళ్లలో కాదు నీ ప్రతాపం
  • దమ్ముంటే రా.. బయటికి వచ్చి మాట్లాడు

 

మంత్రి కేటీఆర్ ఏ కోర్టుకు పోతే మీకేంది నొప్పి. మీకొచ్చిన బాధ ఏంది. మీ ఇష్టం ఉన్నట్టు మీరే ఆరోపణలు చేస్తరు.. మీ ఇష్టం ఉన్నట్టు మీరే నిందలు వేస్తరు. అంటే మీరు ఏం చేసినా.. చప్పుడు చేయకుండా కూర్చోవాలా? ఏంది.. అద్దంకి దయాకర్. నీ నియోజకవర్గం ప్రజలే నిన్ను ఛీ కొడుతున్నారు. నీ నియోజకవర్గంలోనే నువ్వు గెలవలేవు కానీ.. తెగ ఎగురుతున్నావు కదా. మంత్రి కేటీఆర్ ను విమర్శించే స్థాయా నీది. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ పై లేనిపోని ఆరోపణలు చేసి ఏం సాధిస్తారు మీరు. అభివృద్ధిలో పోటీ పడే చేతకాదు మీకు. తెలంగాణను నాశనం చేయడానికి దాపురించారు మీరు.

మీ వల్ల తెలంగాణకు రూపాయి లాభం ఉందా? ఛీ.. ఛీ.. నీ ప్రతాపం యూట్యూబ్ చానెళ్లలోనా? ఎవరు దొంగో తెలంగాణ ప్రజలకు తెలుసు అద్దంకి. నువ్వు ఇంట్లో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పడం కాదు. బయటికి వస్తే తెలుస్తది. అయినా.. మంత్రి కేటీఆర్ ఏ కోర్టుకు పోతే మీకేంది బాధ. హైకోర్టు మీకు, ఎన్జీటీకి మొట్టికాయలు వేసిన విషయాన్ని మరిచిపోయారా? రేవంత్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చినా మీరు మారరా? ఇంకా ఇలా అభాండాలు వేస్తూనే ఉంటారా?

అద్దంకి దయాకర్.. ఊరికే ఇంట్లో కూర్చొని ఆ పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్ వేశారు అనడం కాదు.. ఇదంతా పిరికిపందలు చేసే పని. కేటీఆర్ ఆనాడే చెప్పారు.. ఇదంతా రాజకీయంగా కుట్రపన్ని కావాలని ఫాంహౌజ్ పేరుతో కొత్తనాటకం ఆడుతున్నారని. అది అంతా కావాలని చేసిన నాటకాలు అని తెలంగాణ ప్రజలకు కూడా తెలిసింది. కోర్టు కూడా మీకు వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా మళ్లీ అదే విషయాన్ని లేవనెత్తుతూ యూట్యూబ్ చానెళ్లలో సొల్లు మాటలు మాట్లాడటం మీ అజ్ఞానానికి నిదర్శనం. ఇటువంటి మనుషుల గురించి మాట్లాడటం కూడా వేస్ట్. అందుకే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని పట్టించుకోవడం ఏనాడో మానేశారు. ఇన్నిరోజులు పడుకొని ఇప్పుడు నువ్వు నిద్రలేచి.. నోటికొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు తన్నితన్ని తరిమేస్తరు జాగ్రత్త అద్దంకి.

Top