You are here
Home > Uncategorized > వస్తాయ్.. వస్తాయ్.. అన్నీ వస్తాయ్!

వస్తాయ్.. వస్తాయ్.. అన్నీ వస్తాయ్!

Spread the love

వస్తాయ్.. వస్తాయ్.. అన్నీ వస్తాయ్!

  • పాతబస్తీలో సౌకర్యాలు కావాలంటూ అక్బరుద్దీన్ ఆవేదన
  • కాంగ్రెస్ పాపాలు మరిచి.. టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే
  • గతం గుర్తు చేసుకోవాలని సూచిస్తున్న పాతబస్తీ ప్రజలు
  • కేసీఆర్ పరిపాలనపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్న జనాలు

హైదరాబాద్ కు మెట్రో తన వల్లే వచ్చిందని అంటున్నారు.. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ. అది ఎంత వరకు నిజమో కాదో తెలియదు కానీ.. తన ప్రాంతానికి మాత్రం ఆ సౌకర్యం ఇప్పటివరకూ అందలేదన ఆయన వేదన చెందుతున్నారు. కానీ.. ఓ విషయాన్ని ఓవైసీ గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టే అయినా.. మెట్రో నిర్మాణంలో అడ్డంకులు అధిగమించి.. నిర్మాణాన్ని పూర్తి చేసింది కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే.

ప్రజలకు ఎక్కడెక్కడ అవసరం అన్నది గుర్తించి మరీ.. మెట్రోను ప్రాథమికంగా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు విస్తరణలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా ఉంది. అప్పుడు అర్హత, అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలకు మెట్రో కచ్చితంగా విస్తరించి తీరుతుందని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఇక.. పాతబస్తీలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడాలంటే.. అంతకు ముందు గతం గురించి కచ్చితంగా ప్రస్తావించి తీరాలి.

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ముందు.. కాంగ్రెస్ తో ఎంఐఎం చెట్టాపట్టాలేసుకునే ఉంది. ఆ రెండు పార్టీలకు మంచి స్నేహం ఉంది. అలాంటిది.. నాటి కాంగ్రెస్ పాతబస్తీకి ఏం చేసిందన్నది అక్బరుద్దీన్ అర్థం చేసుకోవాలి. కేసీఆర్ వచ్చాకే.. పాతబస్తీలో వసతులు మెరుగుపడ్డాయన్నది గ్రహించాలి. ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారన్న వాస్తవాన్ని గుర్తించాలి.

ఈ క్రమంలోనే.. మున్ముందు మరింత మెరుగైన పరిస్థితులు పాతబస్తీలో కొలువు తీరడం తథ్యం. ఈ దిశగా.. మంత్రి కేటీఆర్ కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. చార్మినార్ దగ్గర పార్కింగ్ వసతులు సహా.. పాతబస్తీలో రహదారుల విస్తరణ, ఇతర మౌలిక వసతుల కల్పనను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు.. కేసీఆర్ మార్గదర్శకత్వంలో కేటీఆర్ శ్రమిస్తున్నారు. ఇవన్నీ గమనించాల్సిన అవసరం అక్బరుద్దీన్ కు చాలా ఉందని.. ప్రజలంటున్నారు.

Top