You are here
Home > Latest News > జెండా సంగతి తర్వాత.. ముందు హామీల సంగతి తేల్చండి!

జెండా సంగతి తర్వాత.. ముందు హామీల సంగతి తేల్చండి!

Spread the love

జెండా సంగతి తర్వాత.. ముందు హామీల సంగతి తేల్చండి!

  • నిధులియ్య చాతగాదు.. జెండా ఎగరేస్తరట
  • కబ్జాకోరును నిలబెడ్తె.. ఇజ్జత్ మానం పోతదని తెల్వదా
  • ఈటలపై ఆరోపణల మీద క్లీన్ చిట్ గురించి బీజేపీకి అవసరం లేదా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక కేంద్రంగా తెలంగాణలో మరోసారి బీజేపీ రాక్షస రాజకీయాలు చేసేందుకు సిద్ధం అయితున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రజలు ఆ పార్టీని మూడు విషయాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. జెండా ఎగరేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. తన పార్టీ రాష్ట్ర నేతలకు సూచన చేసే ముందు ఈ విషయాలపై.. క్లారిటీ ఇస్తేనే బాగుంటుందని హుజూరాబాద్ ప్రజలు సైతం తేల్చి చెబుతున్నరు.

ఈటల రాజేందర్.. భూ కబ్జా ఆరోపణలపై మంత్రి పదవి పోగొట్టుకున్నడు. తన సచ్ఛీలతను నిరూపించుకోలేక.. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిండు. ఈ విషయంలో ఇప్పటిదాకా.. క్లీన్ చిట్ కోసం ఈటల ప్రయత్నించింది లేదు. కానీ.. బీజేపీలో చేరి హుజూరాబాద్ లో పోటీ చేసేందుకు ఉత్సాహపడుతున్నడు. తన వ్యాపారాల క్షేమం కోసమే ఆయన పుష్పంగా మారిండని జనాలు అంటున్నరు. దీనికి అమిత్ షా.. ఆయన తోక నేతలు ఏమని సమాధానం ఇస్తరు?

రెండో విషయం. ఉప ఎన్నిక అయినా.. మామూలు ఎన్నిక అయినా.. కాస్త పద్ధతి గలోడిని.. నీతి నిజాయితీ ఉన్నోడిని నిలబెడితె.. జనం మెచ్చుతరు. కానీ.. కబ్జాల ఆరోపణలు ఇంకా ఎదుర్కొంటున్న ఈటలనే.. బీజేపీకి దిక్కైండా? ఇంకోడు లేడా? అన్నది కూడా.. ఆ పార్టీ నేతలు చెప్పాలె. మూడో విషయం. తెలంగాణకు నిధుల విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్న తీరుపైనా సరైన సమాధానం చెప్పినంకనె.. బీజేపీ నేతలు హుజూరాబాద్ లో అడుగుపెట్టాలె.

ఈ విషయాలపై స్పష్టత ఇవ్వకుంటే.. బీజేపీ నేతల విషయంలో అనుమానపడాల్సిందే అని ప్రజలు ఫిక్స్ అయి ఉన్నరు. అంతే కానీ.. కిషన్ రెడ్డి, సంజయ్, వివేక్, ఈటల, తరుణ్ చుగ్.. ఇసోంటి తోకమట్ట నేతలు ఇక్కడ పీకేది ఏం లేదని.. మాటలు చెప్పుకోడానికే ఉన్నరని జనాలు ఆల్రెడీ అర్థం చేసుకున్నరు. ఇప్పుడు ఈ 3 ప్రశ్నలకు జవాబు ఇయ్యకుంటె.. కనీసం ప్రచారానికి కూడా బీజేపీ లీడర్లను అనుమతిచ్చేది లేదని హుజూరాబాద్ ప్రజలైతె డిసైడౌతున్నరు.

Top