You are here
Home > Latest News > నల్లడబ్బు తెప్పిస్తానన్న హామీ ఏమైంది అమిత్ షా??

నల్లడబ్బు తెప్పిస్తానన్న హామీ ఏమైంది అమిత్ షా??

Spread the love
  • కరీంనగర్ లో కళ్లు నెత్తికెక్కినట్టు అమిత్ షా మాటలు
  • కేంద్రం ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించని తీరు
  • విజయంపై అతి విశ్వాసంతో అవాకులు చెవాకులు

తెలంగాణ ఉద్యమ కేంద్రం కరీంనగర్ లో సభ పెట్టగానే కళ్లు నెత్తికెక్కాయో ఏమో కానీ… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అతి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా తెలంగాణను దేశంలో అగ్రపథంలో నిలబెట్టిన ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి హద్దు దాటి మాట్లాడారు. హామీలు ఏమయ్యాయి అని నిలదీసి.. మహా పాపం మూటగట్టుకున్నారు. ఎంత చేసినా.. ఏమీ కళ్లకు కనబడనట్టు అద్భుతంగా నటించారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారఖ్, కేసీఆర్ కిట్ నుంచి మొదలు పెడితే పెన్షన్లు, సాగుకు వరాలు, చదువు, జీతాల పెంపు, మిషన్ కాకతీయ, భగీరథ.. ఇలా చాలా చాలా పథకాలు తెలంగాణ భాగ్యరేఖను వెలిగిపోయేలా చేస్తున్నాయి. అయినా ఇదేదీ పట్టకుండా ఏమీ జరగలేదని అనడం అమిత్ షా కే చెల్లింది. బీజేపీ వాళ్లు కళ్లున్న అంధులన్న విషయం నిరూపితమైంది. రాష్ట్రాన్ని ఇంతగా ప్రశ్నిస్తున్నాడే అమిత్ షా.. మరి నాడు మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

నల్ల ధనాన్ని వెనక్కు రప్పిస్తామన్నారే… ఏడాదికి కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారే. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కూడా చెప్పారే. నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని డబ్బాలు కొట్టారే. ఇంత చెప్పి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా హామీ నెరవేర్చారా? నాలుగేళ్ల మోడీ పాలనను కట్ చేసి చూస్తే పెరుగుతున్న చమురు ధరలు, దిగజారుతున్న ఆర్థిక ప్రగతి, పడిపోతున్న రూపాయి విలువ. ఇవి కాక.. ఇంకేమైనా మోడీ సాధించింది ఉందా?

అందుకే.. పరిపాలించడం చేతగానపుడు నోరు మూసుకుని ఉండాలి. సరిగా పాలిస్తున్న వాళ్లను గౌరవించే సంస్కారమైనా ఉండాలి. ఈ రెండూ చేతగాని అమిత్ షాకు, వాళ్ల నేతలు.. రాబోయే రాజకీయ సంచలనాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని ఇప్పుడే పెంపొందించుకోవాలి.

Top