You are here
Home > Uncategorized > అమ్ముడుపోయిన మీడియా సిగ్గులేని రాతలు కేంద్రాన్ని నిలదీయడం మహాపాపమట

అమ్ముడుపోయిన మీడియా సిగ్గులేని రాతలు కేంద్రాన్ని నిలదీయడం మహాపాపమట

Spread the love

 

అమ్ముడుపోయిన మీడియా సిగ్గులేని రాతలు

కేంద్రాన్ని నిలదీయడం మహాపాపమట

బీజేపీ వేసే ఎంగిలి మెతుకులు నాకి బతికే ఒక పత్రిక సిగ్గూమానం అంతా వదిలేసింది. పూర్తిగా బరితెగించి అత్యంత నీచపు వార్తలు రాస్తోంది. తాజాగా మంగళవారం ఇది రాసిన వార్త చూస్తే మీడియా ఇంత దారుణంగా తయారైందా ? అనిపించింది. ఇందులో ఒక వాక్యం చదవండి ‘‘రాష్ట్రంలో అమలు చేయాల్సిన స్కీమ్​లను గాలికొదిలేసి.. కేంద్ర ప్రభుత్వంపై ట్వీట్లు చేసేందుకు, తిట్లు తిట్టేందుకు రాష్ట్ర మంత్రులు, టీఆర్​ఎస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారు.

రాష్ట్రంలో అనేక స్కీమ్​లు ముందుకు సాగక, ఇచ్చిన హామీలు అమలు కాక జనం అవస్థలు పడుతున్నారు. కానీ, అవేవీ అధికార పార్టీ ముఖ్య నేతలకు పట్టడం లేదు. మాటలు చెప్పిన విధంగా రాష్ట్రంలో స్కీమ్​లు అమలైతలేవని, ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందని హుజూరాబాద్​ ఎన్నికల తర్వాత నుంచి టీఆర్​ఎస్​ లీడర్లు ఆందోళన చెందుతున్నారు”అంటూ సిగ్గూలేకుండా రాసుకుపోయింది. అంటే కేంద్రాన్ని నిందించడం మహాపాపం అని ఈ పత్రిక ఉద్దేశమా! దోపిడీని ప్రశ్నించడమే అపరాధమా! మా నిధులు మాకు ఇవ్వండి అని అడగడమం గోహత్య చేసినంత పాపమా ? ఇవెక్కడి మూర్ఖపు రాతలు!! రాష్ట్రంలో 150కిపైగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పెన్షన్లు అందరికీ వస్తున్నాయి.

కొత్తగా 50 వేల జాబ్స్ రాబోతున్నాయి. ఉద్యోగులకు భారీగా జీతాలు ఇస్తున్నారు. భూమి లభ్యం కాకపోవడం వల్లే డబుల్ బెడ్​రూమ్​ ఇండ్ల నిర్మాణం, భూముల పంపిణీ కార్యక్రమం కాస్త మెల్లగా నడుస్తున్నది. ఈ కార్యక్రమాలన్నింటినీ అమలు చేయాలంటే వేల కోట్లు కావాలి. ఈ డబ్బును ఎక్కడి నుంచి తేవాలి ? కేసీఆర్​ ఇంటి వెనుక ఏమైనా లంకె బిందలు ఉన్నాయా ? ఆయన ఫామ్​హౌజ్ చెట్లకు ఏమైనా డబ్బులు కాస్తున్నాయా ? రాష్ట్రం నుంచి ఢిల్లీకి ఏటా రూ.60 వేల కోట్లు వెళ్తే మహానుభావుడు మోడీ కనీసం రూ.20 వేల కోట్లు పంపడం లేదు. ప్రాజెక్టుల్లో మన వాటా ఇవ్వడం లేదు. పన్నుల్లో వాటా రావడం లేదు. నీటి పంపిణీలో మనకు అన్యాయం జరుగుతోంది.

బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ ఊసే లేదు. కాజీపేట ప్రాజెక్టును గాలికి వదిలేశారు. ట్రైబల్​ యూనివర్సిటీ పేరే ఎత్తడం లేదు. ఇంత అన్యాయం జరుగుతుంటే కేసీఆర్​ చేతులు ముడుచుకు కూచోవాలా ? మోడీకి సాష్టాంగ నమస్కారాలు చేయాలా ? ఓపికకూ హద్దు ఉంటుంది కదా. న్యాయం కోసం ఇంకా ఎన్నేళ్లు ఆగాలి. ఎన్నేళ్లు పోరాడాలి ? కడుపు మండిన వాళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టకుంటే ఏం చేస్తారు ? కేసీఆర్​ కోపం తట్టుకోలేకే రాజ్యాంగాన్ని మార్చాలని అన్నారు. ఒక్కటి మాత్రం నిజం. మోడీ ఉన్నంత వరకు తెలంగాణకు న్యాయం జరగదు. బీజేపీని కూకటివేళ్లతో పెకిలిస్తేనే మన రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుంది. అప్పటి దాకా కేంద్రంపై కచ్చితంగా పోరాడితీరాలి.

Top