You are here
Home > Uncategorized > అప్పులు చేయొద్దు.. భూములు అమ్మొద్దు?

అప్పులు చేయొద్దు.. భూములు అమ్మొద్దు?

Spread the love

 

అప్పులు చేయొద్దు.. భూములు అమ్మొద్దు?

  • మరి ఈ కష్టకాలంలో ప్రజా సంక్షేమానికి డబ్బులెక్కడి నుంచి తేవాలి?.
  • ప్రభుత్వం భూములు అమ్మడం అనేది ఒక్క టీఆర్ఎస్సే టైంలోనే చేయట్లే.
  • చంద్రబాబు దగ్గర నుంచి ఈ వ్యవహారం కొనసాగుతోంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు.. కష్టకాలంలో భూముల అమ్మకాలు కామన్.

ప్రభుత్వం భూములు అమ్ముతామంటే.. అదేదో దేశ ద్రోహం అయినట్లు తాటికాయంత అక్షరాలతో వెలుగు పత్రిక హైలెట్ చేస్తోంది. ప్రస్తుతం.. కరోనా టైంలో.. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఈ టైంలో నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ పై ట్యాక్సులు, కరెంటు, బస్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడం కంటే.. ఖాళీగా ఉన్న భూములు అమ్మడం ద్వారా.. ప్రజా సంక్షేమానికి కావాల్సిన ఆదాయం వస్తుంది. కరోనా టైంలో పేదలకు వైద్యం, నిత్యావసరాలు అందించాలంటే.. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. వెలుగు పత్రిక ప్రతీదాంట్లో విషం చిమ్మడం తప్ప.. దాని వెనకున్న పర్యవససానాలు,.. అవసరాలు అనేవి ప్రజలకు చెప్పదు.

బీజేపీకి భజన చేయడం.. టీఆర్ఎస్ మీద విషం చిమ్మడం.. ఇదే వివేక్ మీడియా చేసే పని. వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని ధరలు నిర్ణయించినా.. పెట్రోల్, డీజిల్ పై అడ్డగోలుగా ధరలు పెంచుతున్నా.. వివేక్ మీడియాకు పట్టదు. నిత్యావసరాల ధరలు.. డబుల్ అయినా.. వీ6, వెలుగు పట్టించుకోదు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోని కాషాయ మీడియా.. ప్రభుత్వంపై మాత్రం బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే.. పాఠకులు నానాటికీ తగ్గి పోతున్నారు. ప్రభుత్వం మంచి చేస్తున్నా.. అందులో లొసుగుల్ని వెతికి విమర్శలు చేసే పేపర్ ను తిరస్కరిస్తున్నారు. ప్రతీదాన్ని విమర్శిస్తే.. ప్రజలు ఆదరిస్తారనుకోవడం మీ భ్రమ. ఇప్పటికైనా అందులో నుంచి బయటకు రాండి.

భూముల అమ్మకం ద్వారా వచ్చే డబ్బులను.. ప్రజా సంక్షేమానికి వినియోగిస్తుంది ప్రభుత్వం. లాక్ డౌన్, కరోనా కారణంగా.. నష్టపోయిన ఆదాయాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తోంది. వైద్య రంగానికి ఆదాయం అందిస్తోంది. ప్రభుత్వం హాస్పిటల్స్ లో ఎక్విప్ మెంట్ సమకూరుస్తోంది. డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఇన్సెంటివ్ అందిస్తోంది. కష్టకాలంలో సేవలు అందిస్తూ చనిపోయిన వారికి సహాయం చేస్తోంది. కరోనా నుంచి ప్రజల్ని బయట పడేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. ఇవన్నీ.. డబ్బు లేకుండా జరిగే పనులు కావు. ఇప్పటికైనా కాషాయ మీడియా అర్థం చేసుకుంటే మంచిది.

Top