You are here
Home > Latest News > యూనియ‌న్ నేత‌లారా.. మీ ముఖం ఎక్క‌డ పెట్టుకుంటారు ?

యూనియ‌న్ నేత‌లారా.. మీ ముఖం ఎక్క‌డ పెట్టుకుంటారు ?

Spread the love
  • యూనియ‌న్ నేత‌లారా.. మీ ముఖం ఎక్క‌డ పెట్టుకుంటారు ?
  • నోర్మూస్కోవ‌డం త‌ప్ప మీకు వేరే మార్గం లేదు
  • స‌మ్మెను విర‌మించడ‌మే అంతిమ‌మార్గం
  • లేక‌పోతే జీవితాలే ఆగం కాక‌త‌ప్ప‌దు

 

ఆర్టీసీ త‌మ‌వైపే ఉంటుంద‌ని ఇన్నాళ్లూ ఆశించిన ఆర్టీసీ యూనియ‌న్లు నిన్న‌టి తీర్పుతో డంగైపోయారు. ఏం చేయాలో అర్థం కాని స్థితి. చేసిన త‌ప్పును బ‌హిరంగంగా ఒప్పుకోలేని అవ‌స్థ‌. ప్ర‌జ‌ల‌ను, తోటి కార్మికుల‌ను ఇన్నాళ్లూ ఇబ్బందిపెట్టి ఏమీ ఫ‌లితం రాక‌పోవ‌డంతో బ‌య‌ట‌కు ముఖం చూపించ‌లేని దుస్థితి. కోర్టు తాజా ఉత్తర్వులతో తీవ్ర‌ నిరాశకు గురవుతున్నారు.

ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు, బెదిరింపులు చేసినా లెక్కచేయకుండా.. హైకోర్టు తీర్పు కోసం ఆశగా ఎదురుచూశారు. సమ్మె మొదలైనప్పటి నుంచి ఈ అంశంపై  విచారణ జరిగిన ప్రతిసారి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తమకు అనుకూలంగా ఉండటంతో కార్మికుల్లో మరింత ఉత్సాహం, నమ్మకం పెరిగింది. అయితే స‌మ్మె విష‌యంలో ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించే హ‌క్కు త‌న‌కు లేద‌ని హైకోర్టు స్వ‌యంగా ఒప్పుకోవ‌డంతో ఆర్టీసీ యూనియ‌న్ నాయ‌కులు, విప‌క్ష నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. విలీనం త‌ప్ప‌న్న ప్ర‌భుత్వం మాట పెడచెవిన పెట్టినందుకు ఇప్పుడు ఫ‌లితం అనుభ‌విస్తున్నారు. జీతాల‌కు డ‌బ్బుల్లేవంటే విన‌లేదు. కొత్త బ‌స్సులు కొనాల‌ని ప‌ట్టుబ‌ట్టి కూచున్నారు. కేంద్రానికి ఫిర్యాదు చేసి కేసీఆర్‌ను స‌తాయిద్దామ‌ని వేసిన ప్లాన్ కూడా బెడిసికొట్టింది. స‌మ్మె విష‌యంలో అన్ని సంఘాలు, పార్టీలు నోర్మూసుకొని కూర్చోవ‌డం ఏమీ చేయ‌లేవు. ఇక‌నైనా కేసీఆర్ శ‌ర‌ణు వేడుకుంటే ఫ‌లితం ఉండొచ్చు.

Top