You are here
Home > Latest News > సమ్మె చావుల నేరాన్ని తప్పించుకునేందుకు అశ్వత్థామరెడ్డి అండ్​ కో

సమ్మె చావుల నేరాన్ని తప్పించుకునేందుకు అశ్వత్థామరెడ్డి అండ్​ కో

Spread the love
  • పెళ్లాంపిల్లలతో హ్యాపీగా గడుపుతున్న ఆర్టీసీ జేఏసీ నేతలు
  •  చనిపోయిన కార్మికుల ఇండ్లలో మాత్రం విషాదఛాయలు
  • సమ్మె చావుల నేరాన్ని తప్పించుకునేందుకు అశ్వత్థామరెడ్డి అండ్​ కో

 

ఇల్లీగల్​ సమ్మెను ముగిస్తున్నట్లు అశ్వద్థామరెడ్డి అండ్​ కో ప్రకటించారు. ప్రభుత్వాన్ని బ్లాక్​మెయిల్​ చెయ్యడానికి ఏకంగా 30 మంది కార్మికుల్ని చంపేసిన ఈ బ్లాక్​మెయిలర్స్​ గ్యాంగ్​.. హత్యానేరం నుంచి తప్పించుకోడానికి ట్రైచేస్తున్నది. బీజేపీ మౌత్​పీస్​, తెలంగాణ విషపుత్రిక వెలుగు పేపర్​ కూడా తన చేతులకంటిన నెత్తురును కడుక్కునే పనిలో పడింది. చావులకు బాధ్యులైనవాళ్లను ప్రస్తావించకుండా సమ్మె కథనాలు వండివార్చింది. ఇల్లీగల్​ సమ్మె ద్వారా బీజేపీ ఇతర ప్రతిపక్షాలు ఫాయిదా పొందాలని చూసిన విషయాన్ని ప్రజలందరూ గమనించిన్రు. అందుకే ఇవాళ ఏ రోడ్డు మీదికి పోయి అడిగా, సోషల్​ మీడియాలో ఏ పోస్టు చూసినా.. స్టూడెంట్ల నుంచి ముసలోళ్ల దాకా చెప్పేది ఒకటే మాట.. ‘‘ఈ అశ్వద్థామరెడ్డి గాడు, ఇతర జేఏసీ నాయకులు కలిసి అన్యాయంగా 30 మంది కార్మికుల్ని పొట్టనపెట్టుకున్నరు.

ప్రతిపక్షాలు, కొన్ని పేపర్లు ఎంత రెచ్చగొడితే యూనియన్​ నేతలు అంత రెచ్చిపొయిన్రు. సమ్మె చావులకు కచ్చితంగా వాళ్లే బాధ్యులు”అని తడుముకోకుండా చెబుతున్నరు. నిజమే, జెన్యున్​గా సాగిన రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ చావులు చోటుచేసుకున్నా, మనలో ఏ ఒక్కరూ రిగ్రెట్​ ఫీల్​కాలేదు. సంపాదించే మనిషి చచ్చిపోతే ఆ కుటుంబం ఎంత నష్టపోతదో మనందరికీ తెలుసు. అందుకే సీఎం కేసీఆర్​ సమ్మె మొదట్లోనే కార్మికులకు విజ్ఞప్తి చేసిండు.‘‘మీ కుటుంబ పెద్దగా, రాష్ట్రానికి అధినేతగా కార్మికుల్ని, వాళ్ల కుటుంబాల్ని రిక్వెస్ట్​ చేస్తున్నాను.. దయచేసి ఇల్లీగల్​ సమ్మెను బంద్​పెట్టండి. కుటుంబాల్ని ఆగం చేసుకోకండి.. మీ పక్కన నిలబడ్డ ప్రతిపక్షాలు రేప్పొద్దున టాటా బైబై చెప్పి వెళ్లిపోతాయి”అని కన్నతండ్రిలాగ సముదాయించిండు.

అయినా యూనియన్లు వినలేదు.. చివరికి యూనియన్ నేతలందరూ సేఫ్​గా సమ్మె విరమించి, కార్మికుల చావుల్ని మర్చిపోయి.. పెళ్లాంపిల్లలతో హ్యాపీగా గడుపుతున్నరు. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్లీ కార్మికుల్నే బలిపశువుల్ని చేసేందుకు అశ్వద్థామరెడ్డి అండ్​ కో ప్రయత్నాలు చేస్తున్నరు. డిపోలపై, తాత్కాలిక సిబ్బందిపై దాడి చేయాలంటూ కార్మికులకు పిలుపునిచ్చారు. వీళ్ల బ్లాక్​మెయిల్​ రాజకీయాల సంగతి తెలుసు కాబట్టే ప్రజాధనాన్ని కాపాడుకోడానికి గట్టి బందోబస్తు ఏర్పాటుచేసింది. లేబర్​​ కోర్టు తీర్పుపై నమ్మకం ఉందంటున్న జేఏసీ నేతలు సమ్మె ఎందుకు విరమించిన్రో చెప్పలేదు చూసిన్రా.. అదీ వీళ్ల బ్లాక్​మెయిల్​ తత్వం.

Top